Wednesday, 20 Nov, 8.26 am తెలంగాణ

తెలంగాణ
ఆ డిపో బస్సు ఒక్కటీ రోడ్డెక్కలేదు!

ముషీరాబాద్‌-2 డిపోలో విచిత్ర పరిస్థితి

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో ఒక బస్‌ డిపో కొత్త రికార్డు సృష్టించింది. సమ్మె మొదలైన గత 46 రోజుల్లో ఆ డిపో నుంచి ఒక్కబస్సూ రోడ్డెక్కలేదు. రాష్ట్రంలో 97 బస్‌ డిపోలు ఉండగా.. 96 చోట్ల ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఏదోలా బస్సులను తిప్పుతోంది. కానీ, ముషీరాబాద్‌-2 బస్సు డిపోలోని 140 బస్సులకు ఒక్కటంటే ఒక్కటి కూడా బయటకు రావడంలేదు. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌కు సమీపంలో ఉన్న ఈ డిపోలోని 140 బస్సులను జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద 2012లో కేంద్రం మంజూరు చేసింది. టాటా కంపెనీ రూపొందించిన ఆ బస్సులు సాధారణ బస్సులకు కాస్త భిన్నం. వీటిని నడిపేందుకు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సాధారణ బస్సులు నడిపే అనుభవం ఉన్న డ్రైవర్లు వీటిని నడపటానికి ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఈ బస్సుల మన్నిక అంతంతే.

ప్రస్తుతం కండీషన్‌ తప్పిన ఆ బస్సులు ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వాటిని డిపోలోనే ఉంచేశారు. ఫలితంగా సమ్మె కాలంలో ఆ డిపో నుంచి ఒక్క బస్సూ గేటు దాటలేదు.

Sakshi
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Telangana
Top