Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆదర్శ కుటుంబంలో ఏం జరుగుతోంది?

ఆదర్శ కుటుంబంలో ఏం జరుగుతోంది?

Telugu 360 1 week ago

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కి స్పెషల్ క్రేజ్ ఉంది. 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' సినిమాలకు త్రివిక్రమ్ రైటర్‌గా పనిచేశారు.

వెంకటేష్ కామెడీ టైమింగ్‌కు త్రివిక్రమ్ మాటలు తోడైతే ఆ సినిమాలు ఎంతగా అలరిస్తాయో ఆడియన్స్‌కి ఒక అంచనా ఉంది. త్రివిక్రమ్ డైరెక్టర్‌గా మారినప్పటి నుంచి ఈ కాంబినేషన్‌లో ఒక సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం'తో ఆ కాంబినేషన్ సెట్ కావడంతో సినిమాపై అంచనాలు సహజంగానే పెరిగాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పుడు రెండు ఆసక్తికరమైన విషయాలు చెక్కర్లు కొడుతున్నాయి.

'ఆదర్శ కుటుంబం'లో వెంకీ 'కూలీ నంబర్ 1'లోని 'దండాలయ్యా' పాటను కూడా రీమేక్ చేయబోతున్నారనే టాక్. వినాయక చవితి సీజన్‌లో ఈ పాటకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి పందిరిలో ఈ పాట మోగుతూ ఉంటుంది. అలాంటి పాటను ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం' కోసం ఎంచుకోవడం ఖచ్చితంగా ఒక స్పెషల్ అట్రాక్షన్.

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరికొంత సమయం అవసరం కావడంతో సినిమా ఒకటి, రెండు వారాలు వాయిదా పడే అవకాశం ఉందని వినిపిస్తోంది. అక్టోబర్ 9, అక్టోబర్ 16 తేదీలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

కాకపోతే ఇలాంటి లీక్ బయటికి వచ్చిందంటే ఖచ్చితంగా రిలీజ్ విషయంలో మేకర్స్‌లో డైలమా ఉందనే సంకేతాలు ఉన్నట్లే. 'ఆదర్శ కుటుంబం' ఇప్పటికే ఆలస్యమైంది. కాకపోతే త్రివిక్రమ్ స్టైల్ వేరు. ఏ డేట్‌కి వచ్చినా కంటెంట్ బాగుంటే సినిమా ఆడుతుందనే నమ్మకం ఆయనకి. మరి వాయిదా విషయంలో బయటికి వచ్చిన లీకులపై నిర్మాతలు ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360