Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆగస్ట్ రివ్యూ: బాక్సాఫీస్‌కి కొత్త ఊపు

ఆగస్ట్ రివ్యూ: బాక్సాఫీస్‌కి కొత్త ఊపు

Telugu 360 3 weeks ago

గస్ట్ టాలీవుడ్ ప్రోగ్రెస్ కార్డ్ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఒకే నెలలో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్‌బస్టర్లు కనిపించాయి. తొలి వారంలో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఆకట్టుకున్నాడు.

వరుణ్ కి చాలా రోజుల తర్వాత ఒక డీసెంట్ సినిమా పడింది. సినిమాలో కామెడీ వర్క్‌అవుట్ అయ్యింది. ముఖ్యంగా సత్య ట్రాక్ బాగా కలిసొచ్చింది. వసూళ్ల పరంగా నిర్మాతలు కూడా హ్యాపీ.

లోకేష్ కనకరాజు 'డీసీ' సినిమా అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. తొలిసారి కెమెరా ముందుకు నటుడిగా వచ్చిన లోకేష్ ఈ సినిమాతో సర్‌ప్రైజ్ చేశాడు. కథలో ఉన్న ఇంటెన్సిటీ, మేకింగ్, టేకింగ్, మ్యూజిక్‌తో ఈ సినిమా మ్యాజిక్ చేసింది. తెలుగులో రిలీజ్ చేసిన ఏషియన్ గ్రూప్‌కి లాభాలు చూపించింది.

పంద్రాగస్ట్ స్పెషల్‌గా వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో సూర్య మరో విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడు వెంకీ అట్లూరి హ్యాట్రిక్ కొట్టాడు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా ప్రేక్షకులను అలరించింది. నిజానికి ఈ సినిమాని పూర్తిగా తమిళ్‌లో తీశారు. అయినప్పటికీ ఇందులో ఉండే ఎమోషన్ తెలుగు సినిమానే అన్నంతగా కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే పబ్లిక్ రెస్పాన్స్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. మమితా బైజు ప్రెజెన్స్ మరో స్పెషల్ అట్రాక్షన్. మదర్ సెంటిమెంట్ కూడా బాగా వర్క్‌అవుట్ అయింది. మొత్తానికి సితార బ్యానర్‌కి మంచి హిట్ పండింది.

ఆగస్ట్ మూడో వారంలో రవితేజ 'ఇరుముడి'తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. ఇది మామూలు సక్సెస్ కాదు. ప్రేక్షకులు ఈ సినిమాని సొంతం చేసుకున్నారు. కథలోని ఎమోషన్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయిపోయింది. అయ్యప్ప స్వామి డివైన్ ఎలిమెంట్స్, పాటలు జనాల్లోకి చొచ్చుకెళ్లాయి. రవితేజ చాలా కాలంగా ఇలాంటి విజయం కోసం ఎదురుచూశారు. తన మాస్ ఇమేజ్‌ని పక్కన పెట్టి కేవలం కథనే నమ్ముకుని చేసిన ఈ సినిమా రవితేజ ఎదురుచూసిన హిట్ అందించింది. వారం తర్వాత కూడా కొన్ని చోట్ల హౌస్‌ఫుల్ బోర్డ్స్ కనిపించడం ఈ సినిమా విజయానికి గీటురాయి.

ఎన్నో అంచనాలతో వచ్చిన యష్ 'టాక్సిక్' మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. టీజర్లు, ట్రైలర్‌లతో సంచలనం రేపిన ఈ సినిమా థియేటర్‌లో మాత్రం దారుణమైన ఫలితాన్ని చూసింది. కథ, కథనాలు, పాత్రలు రాంగ్ డైరెక్షన్‌లోకి వెళ్లాయి. ఏ స్థాయిలోనూ ఈ సినిమా అలరించలేకపోయింది. కోట్లు ఖర్చు చేసిన స్టైలిష్ మేకింగ్ వృథా ప్రయాసగా మిగిలింది.

ఈ నెలలో వచ్చిన చిన్న సినిమాలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. 'కేజేక్యు', 'ఎంఎస్ రాజు ఆగధ', 'హుషారు పిట్టలు', అమీర్ లోగ్, విశాల్ దర్శకత్వంలో వచ్చిన 'మకుటం' చిత్రాలు ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించలేకపోయాయి. చివరి వారంలో నయనతార 'హాయ్' సినిమా వచ్చింది. అసలు ఇలాంటి సినిమా ఒకటి ఉందనే సంగతి ఆడియన్స్‌కి తెలియదు. ఈ సినిమా కంటెంట్ కూడా నిలబడలేకపోయింది.

మొత్తానికి చూసుకుంటే 'కొరియన్ కనకరాజు', 'డీసీ', 'విశ్వనాథ్ అండ్ సన్స్', 'ఇరుముడి' చిత్రాల విజయాలు, ఆడియన్స్ ఫుట్‌ఫాల్స్ ఆగస్ట్ బాక్సాఫీస్‌కి కొత్త జోష్‌ని తీసుకొచ్చాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360