జగన్ రెడ్డితో ఢీకొట్టాలని ఏబీఎన్ ఆర్కేకు చాలా ఉత్సాహం ఉంటుంది. ఎప్పుడు జగన్ రెడ్డి మీడియా లో తన పేరు వచ్చినా.. ఆయన నోటి వెంట తన పేరు వచ్చినా తర్వాత వారం కొత్త పలుకు పూర్తిగా దానికే అంకితం చేస్తారు.
తాను తొడలు కొట్టుకుంటూ.. బస్తీమే సవాల్ రండి.. తేల్చుకుందాం అని చాలెంజ్ చేస్తూంటారు. ఈ వారం కూడా అదే చేశారు.
ఆర్కే పిల్లలు అమరావతి భూసమీకరణలో పొలాలు ఇచ్చారు. దానికి రిటర్నబుల్ ప్లాట్లు వచ్చాయి. ఆ వివరాలతో సాక్షి వారికి ప్రైమ్ ఏరియాల్లో వచ్చాయని .. అక్రమంగా కేటాయించుకున్నారని రాసేశారు. ఆర్కేకు ఇంత కన్నా మంచి అవకాశం దొరకదు. వెంటనే తన పత్రికలో పత్రికాభాషలోనే వీలైనంతగా తిట్ల పురాణంతో కథనాల వివరణ లాంటిది ఇవ్వడమే కాదు.. ఈ వారం తన కొత్తపలుకులో చాలెంజ్ చేసేశారు. ఆ ప్లాట్లు అందరికీ కేటాయించినట్లు కేటాయించలేదని.. నిరూపిస్తే మొత్తం జగన్ రెడ్డికే..లేదా వైసీపీకే ఇచ్చేస్తానని ప్రకటించారు. చాయిస్ నీదేనని కూడా సవాల్ చేశారు.
మాములుగా అయితే తన ఆర్టికల్ మొత్తం ఇదే అంశంపై ఉండేది కానీ.. జగన్ రెడ్డి ప్రెస్మీట్ పెట్టి.. తన ఫ్యాక్షన్ కుటుంబం చరిత్రను వెలికి తీసే అవకాసం కల్పించారు. దాంతో ఎక్కువగా దానిపైనే ఆర్కే దృష్టి కేంద్రీకరించారు. రాజారెడ్డి, వైఎస్ కుటుంబం ఫ్యాక్షన్ గురించి ఇప్పటి తరానికి తెలిసేలా.. అన్ని వివరాలు చెప్పే ప్రయత్నం చేశారు. జగన్ రెడ్డి శవరాజకీయాలు, తల్లి, చెల్లిని వెళ్లగొట్టడం, కుటుంబాన్ని నాశనం చేసుకోవడం వంటివన్నీ చెప్పారు.ల
జగన్ రెడ్డికి.. సాక్షికి ఆర్కే సవాల్ విసరడం ఇదే మొదటి సారి కాదు. అయితే బురద చల్లిన సాక్షి పెద్దలు.. వైసీపీ నేతలు.. తర్వాత సైలెంటుగా అయిపోవడం జరుగుతోంది. ఇటీవల ఏబీఎన్ ఆఫీసుల ముందు ధర్నాలు కూడా చేశారు. చివరికి చల్లబడిపోయారు. ఇప్పుడు అదే ఆర్కేకు అలుసైపోయింది. ఇప్పుడైనా ఆయన సవాల్ ను జగన్ రెడ్డి స్వీకరిస్తారా.. హిట్ అండ్ రన్ లాగా.. బురద చల్లేసి పారిపోతారా?

