Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్కే  పలుకు:  దేశంలో అలజడికి విదేశీ కుట్ర !

ఆర్కే పలుకు: దేశంలో అలజడికి విదేశీ కుట్ర !

Telugu 360 5 days ago

నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకల్లో సోషల్ మీడియాతోనే యువతను రెచ్చగొట్టి వారితో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలగొట్టించిన వ్యవహారం మన కళ్ల ముందే ఉంది.

దీని వెనుక అమెరికా వంటి విదేశీ శక్తులు ఉన్నాయని అందరూ నమ్ముతారు. ఇప్పుడు ఇండియాలో కొంత మంది కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో అదే తరహా ఆందోళనలు చేస్తున్నారు. మా లక్ష్యం కూడా ప్రభుత్వాన్ని తరిమికొట్టడమేనని చెబుతున్నారు. అందుకే వీరి వెనుక విదేశీ శక్తులు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది. దీన్ని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తవ కొత్త పలుకులో నిర్దారించారు. ఇందుకు సాక్ష్యంగా సంచలన విషయాలను కూడా వెల్లడించారు.

ఉపరాష్ట్రపతి ప్లస్ రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న జగదీప్ థన్‌ఖడ్ విదేశీ కుట్రలో కీలక పాత్ర పోషించారు. బీజేపీకి సొంతంగా మెజార్టీ రాని సమయంలో మోదీ ప్రభుత్వం మళ్లీ రాకుండా చేసేందుకు టీడీపీ, జేఀడీయూలతో పాటు మరికొన్ని పార్టీలను ఆయన కలిసేందుకు ప్రయత్నించారు. ఆయనకు అనిల్ అంబానీ సహకరించారు. ఈ విషయాలన్నీ ప్రధాని మోదీకి తెలిశాయి. దీంతో థన్‌ఖడ్‌ను రాత్రికి రాత్రే సాగనంపారు. కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించారు. థన్‌ఖఢ్‌ను అలా రాజీనామా చేయించడం వెనుక చాలా పెద్ద విషయమే ఉంటుందని అందరికీ తెలుసు. కానీ అదేమిటన్నది ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. మొదటి సారి వేమూరి రాధాకృష్ణ బయట పెట్టారు.

రాజకీయంగా అలజడి రేగినప్పుడు విదేశీ కుట్ర అని ప్రభుత్వాలు అనడం సహజమే కానీ.. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు చూస్తూంటే నిజంగానే అలాంటి కుట్రలు జరుగుతున్నాయని అనుమానించక తప్పదని ఆర్కే అంటున్నారు. పొరుగు దేశాలు బలైన తీరు.. అమెరికా వ్యవహారం దీనికి సాక్ష్యం. సీజేపీ వంటి పార్టీలకు క్రేజ్ రావడం వెనుక ఖచ్చితంగా విదేశీ శక్తులు ఉన్నాయని… సోషల్ మీడియా ద్వారా దేశంలో అలజడికి ప్రయత్నాలని గట్టిగా నమ్ముతున్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉండబట్టే.. సుప్రీంకోర్టులో హరీష్ సాల్వే ఈ విషయాన్ని చెప్పారంటున్నారు.

బొద్దింకల జనతా పార్టీకి జగన్ మద్దతు ప్రకటించడంపై ఆర్కే తనదైన పద్దతిలో స్పందించారు. ఆ పార్టీ ఉనికి ఇక కోల్పోయినట్లేనని.. జగన్ మద్దతును స్వీకరించడంతోనే ఆ పార్టీ నైతికత దెబ్బతిన్నదని క్లారిటీ ఇచ్చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360