Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్కే పలుకు:   రేవంత్ వే టు బీజేపీ !

ఆర్కే పలుకు: రేవంత్ వే టు బీజేపీ !

Telugu 360 3 weeks ago

బీజేపీ బలమైన నాయకుడి కోసం వెదుకుతున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితులు రాను రాను దిగజారిపోతున్నాయి..అని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఈ వారం కొత్తపలుకులో ఓ హింట్ ఇచ్చారు.

కాంగ్రెస్‌లో ఉన్న పరిస్థితుల్ని నిశితంగా విశ్లేషిస్తున్న సమయంలో మధ్యలో స్పేస్ లేకపోయినా బీజేపీ అంశాన్ని తీసుకు వచ్చారు. అంటే.. నిప్పు లేనిదే పొగ రాదని ఆయన చెప్పాలనుకున్నారు.

ప్రస్తుతం రేవంత్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌లో కొంత మంది ఎమ్మెల్యేలు వినిపిస్తున్న అసంతృప్తి వెనుక ఖచ్చితంగా కుట్ర ఉందని.. రేవంత్ మేలుకోవాలని ఆర్కే చెబుతున్నారు. ఇప్పటికే రేవంత్ సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నల్లగొండకు చెందిన ఎమ్మెల్యే ఒకరు బీజేపీని సంప్రదించారని కూడా చెబుతున్నారు. అందులో నిజం ఉందో లేదో కానీ…రేవంత్ ఖచ్చితంగా తన వర్గాన్ని పెంచుకోవాలని మాత్రం గట్టిగా సలహా ఇచ్చారు. ప్రస్తుతానికి రేవంత్ కు ఏ వర్గం లేదని ఆర్కే చెబుతున్నారు.

ఎన్నికలకు ముందు పార్టీ నేతలు… పరిస్థితి బాగోలేదనుకుంటే పార్టీ మారుతారు కానీ.. రెండేళ్ల ముందే పరిస్థితి ఇలా ఉందంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు. రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదన్నది ఆర్కే నిశ్చితాభిప్రాయం. అందుకే రేవంత్ ను బలహీనపరిస్తే.. కాంగ్రెస్ కోలుకోవడం అసాధ్యం. ఈ కోణంలోనే ఆయన కు కాంగ్రెస్ పార్టీలో తేడా వస్తే… వెంటనే బీజేపీలో చేరిపోతారని.. అక్కడ ఆ పార్టీ ఓ బలమైన నేత కోసం చూస్తోందని కూడా గుర్తు చేశారు. ఇది జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే.. ఆర్కే మాత్రం కాంగ్రెస్ లో పరిస్థితి గురించి చాలా విషయాలు బయట పెట్టారని అనుకోవచ్చు.

అదే సమయంలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డిని ఓ ఆట ఆడుకున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం గురించి తానేమీ చెప్పలేదు కదా అంటూనే… చెప్పుకొచ్చారు. ఐదు వేల కోట్లు ఖర్చు పెడతానని చెప్పే ఆయన దగ్గరఐదు వందల కోట్లు కూడా ఉండవని.. నేరుగానే చెప్పారు. కెపాసిటీ చూపిస్తానని చేసిన సవాళ్లపైనా కామెడీ చేశారు. వంద కాకపోతే వెయ్యిచానళ్లు.. పత్రికలు పెట్టుకుని ముఖ్యమంత్రిగా ప్రకటించుకోవాలని సెటైర్లు వేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360