సమంత 'మా ఇంటి బంగారం' మరోసారి వాయిదా పడింది. మే 15న రావాల్సిన సినిమా ఇది. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి చడీ చప్పుడు లేదు. ఇప్పుడు చిత్రబృందం కొత్త డేట్ చెప్పింది.
జూన్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఐపీఎల్ తో క్లాష్ వద్దనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు ప్రకటించారు.
ఐపీఎల్ తో సినిమాలకు పెద్ద కష్టమే వచ్చిందిప్పుడు. సాయింత్రం అయితే… యూత్ మొత్తం టీవీలకు అతుక్కుపోతున్నారు. థియేటర్ల దగ్గర హడావుడే కనిపించడం లేదు. అందుకే థియేటర్లు ఫుట్ ఫాల్స్ లేక వెల వెలబోతున్నాయి. దాంతో కొత్త సినిమాలు వాయిదా బాట పట్టాయి. కాస్త ఎదురు చూసే బరిలో దిగాలని నిర్ణయించుకొన్నాయి. ఈ జాబితాలో సమంత సినిమా కూడా చేరిపోయింది.
జూన్ 4న 'మా ఇంటి బంగారం' రిలీజ్ చేద్దామనుకొన్నారు. కానీ ఆ రోజే 'పెద్ది' వస్తోంది. దాంతో 'పెద్ది' కి రెండు వారాల గ్యాప్ ఇవ్వాల్సివచ్చింది.
నందిని రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా ఇది. సమంత భర్త రాజ్.డికె నిర్మాతగా వ్యవహరించారు. రెండో పెళ్లి తరవాత సమంత నుంచి వస్తున్న సినిమా ఇది. కాబట్టి.. జనాల ఫోకస్ ఉంది. కాకపోతే.. ఇప్పటి వరకూ వచ్చిన కంటెంట్ ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయింది. ముఖ్యంగా రిలీజ్ చేసిన ఒక్క పాట కూడా జనం లోకి వెళ్లలేదు. రిలీజ్ కి ఇంకా టైమ్ ఉంది కాబట్టి, ఇప్పటి నుంచే కాస్త ప్రిపరేషన్లు మొదలెడితే మంచిది.

