Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అక్షర విప్లవం దిశగా ఏపీ - 82 శాతం దాటిన అక్షరాస్యత !

అక్షర విప్లవం దిశగా ఏపీ - 82 శాతం దాటిన అక్షరాస్యత !

Telugu 360 2 weeks ago

దేశంలోనే అత్యంత తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా విమర్శలు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్, గత రెండేళ్లలో సాధించిన ప్రగతి విద్యా రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తోంది.

2024 నాటికి కేవలం 72.6 శాతంగా ఉన్న అక్షరాస్యత, 2026 నాటికి ఏకంగా 82.1 శాతానికి చేరుకుంది. జాతీయ సగటు కంటే వెనుకబడిన స్థితి నుంచి కేవలం రెండేళ్ల వ్యవధిలోనే దాదాపు 10 శాతం మేర అక్షరాస్యత పెరగడం వెనుక విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ చేపట్టిన పక్కా ప్రణాళికలు, క్షేత్రస్థాయి పరిశీలన, రిజల్ట్-ఓరియంటెడ్ విధానాలే ప్రధాన కారణం.

ఫలితాలను ఇస్తున్న అక్షర ఆంధ్ర

ఈ భారీ మార్పుకు అక్షర ఆంధ్ర కార్యక్రమం వెన్నెముకగా నిలిచింది. విద్యా శాఖను చేపట్టిన వెంటనే నారా లోకేష్, కేవలం పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతోనే సరిపెట్టకుండా ఫలితాలు ఆధారంగా పనిచేసే ప్రత్యేక కార్యాచరణను అమలు చేశారు. సుమారు 11 ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలలో నిర్వహించిన అక్షరాస్యతా విభాగాలు, ఫీల్డ్ ప్రోగ్రామ్‌ల ద్వారా గత ఏడాది కాలంలోనే దాదాపు 25 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చడం లోకేష్ పరిపాలనా దక్షతకు అద్దం పడుతోంది.

స్కూల్ డ్రాపౌట్ల తగ్గింపు

అంతేకాకుండా, పాఠశాల విద్యలో డ్రాపౌట్లను తగ్గించి హాజరు శాతాన్ని పెంచడంపై మంత్రి లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. LEAP యాప్ ద్వారా బడికి దూరమైన 1.64 లక్షలకు పైగా పిల్లల డేటాను సేకరించి, వారిలో సుమారు 33 వేల మందిని తిరిగి పాఠశాలల్లో చేర్పించడం, టీచర్ల హాజరును 98.97 శాతానికి తీసుకెళ్లడం విద్యావ్యవస్థలో వచ్చిన సమూల మార్పుకు ఉదాహరణ. ఉపాధ్యాయుల కొరత తీర్చే దిశగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, తల్లికి వందనం, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ ద్వారా విద్యార్థుల్లో జవాబుదారీతనాన్ని లోకేష్ పెంచగలిగారు.

100 శాతం అక్షరాస్యత టార్గెట్

ఇప్పుడు ప్రభుత్వం విధించుకున్న ప్రతిష్టాత్మక లక్ష్యం సెప్టెంబర్ 2027 నాటికి 100% సంపూర్ణ అక్షరాస్యత సాధించడం. దీనికోసం 2027 మార్చి నాటికి మరో 25 లక్షల మందిని, సెప్టెంబర్ 2027 నాటికి మిగిలిన 27 లక్షల మందిని అక్షరాస్యులుగా మార్చడానికి ప్రజాప్రతినిధులను, స్థానిక సంస్థలను భాగస్వాములను చేస్తూ టైమ్-బౌండ్ టార్గెట్లను నిర్దేశించారు. ఇది కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ప్రతీ నియోజకవర్గంలో కార్యాచరణ వేగవంతం అయ్యేలా ఐఏఎస్ అధికారులతో క్రమం తప్పకుండా చేస్తున్న సమీక్షలే ఈ వృద్ధికి బలం చేకూరుస్తున్నాయి.

గడిచిన రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో నమోదైన ఈ గణనీయమైన మార్పు నారా లోకేష్ రాజకీయ, పరిపాలనా సామర్థ్యానికి ఒక బలమైన రుజువుగా నిలుస్తోంది. ఒకప్పుడు జాతీయ స్థాయిలో అక్షరాస్యతలో ఆఖరి వరుసల్లో నిలిచిన ఏపీని, 2027 నాటికి దేశంలోనే మొదటి సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రాలలో ఒకటిగా నిలిపేందుకు లోకేష్ వేస్తున్న అడుగులు ఆయన విజనరీ లీడర్‌షిప్‌ను స్పష్టం చేస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360