Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమరావతి రైతుల పేరుతో జగన్ రివర్స్ ప్లాన్ ఫెయిల్

అమరావతి రైతుల పేరుతో జగన్ రివర్స్ ప్లాన్ ఫెయిల్

Telugu 360 2 weeks ago

మావిగన్ సృష్టికర్త జగన్ అమరావతి రైతులతో సమావేశం అంటూ వైసీపీ హడావుడి చేసింది. కానీ అమరావతికి భూములు ఇవ్వకుండా.. ఉన్న అతి కొద్ది మంది రైతులు.. అసలు భూములే ఇవ్వని ఇతర వైసీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించా జగన్.

రాజధాని భూసమీకరణలో భాగంగా ఇంకా భూములు ఇవ్వని రైతులతో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో సమావేశం ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ ఇటీవల ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను అస్త్రంగా చేసుకుని, ఆయా గ్రామాల రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను కూడగట్టాలని వైసీపీ భావించింది. అయితే, ఈ భేటీకి క్షేత్రస్థాయి నుంచి ఆశించిన స్పందన రాలేదు. భూములివ్వని రైతులు కీూడా అత్యధికులు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.

భూసేకరణ ప్రక్రియకు సంబంధించి స్థానికంగా గ్రామసభలు జరగాల్సి ఉండటంతో, సీఆర్డీఏ నోటిఫికేషన్‌తో ఇబ్బందులు పడుతున్న అసలైన రైతులు ఆ సభలకే ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు ఎంత ప్రయత్నించినప్పటికీ, బాధితులైన రైతులను తాడేపల్లికి పెద్ద సంఖ్యలో తరలించలేకపోయారు. చివరి నిమిషంలో లోటును భర్తీ చేసేందుకు పార్టీ శ్రేణులు, వైసీపీ అభిమానులనే రైతుల ముసుగులో తీసుకొచ్చి తాడేపల్లి నివాసం ముందు నిలబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గత ఐదేళ్లుగా అమరావతి వద్దు.. మూడు రాజధానులే ముద్దు అంటూ తీవ్రంగా వాదించిన జగన్, ఇప్పుడు హఠాత్తుగా అమరావతి రైతుల పక్షాన నిలబడతామనడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. ఒకవైపు అమరావతి ఏకైక రాజధానిగా అభివృద్ధి చెందడాన్ని వ్యతిరేకిస్తూనే, మరోవైపు ఇక్కడి రైతులకు న్యాయం చేస్తామని జగన్ ఏ ముఖం పెట్టుకుని చెబుతారనే ప్రశ్నలు వస్తున్నాయి. తన రాజకీయ లబ్ధి కోసమే ఈ డ్రామా ఆడారని, అధికారంలో ఉన్నప్పుడు రైతులను నానా ఇబ్బందులు పెట్టి, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ రాజధాని ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అమరావతిపై స్పష్టమైన, సానుకూల విధానం లేకుండా కేవలం డ్రామా లతో మైలేజ్ సాధించాలనుకోవడం భ్రమ అవుతుందని కొందరు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రజా బలం లేని ఇలాంటి సమావేశాల వల్ల పార్టీ మరింతగా నవ్వులపాలవుతోందని, ప్రజల్లో నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని క్షేత్రస్థాయి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360