Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనంతబాబుకు  నయం కాని ఆరోగ్య సమస్య !?

అనంతబాబుకు నయం కాని ఆరోగ్య సమస్య !?

Telugu 360 2 weeks ago

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉండి, బెయిల్ రద్దవ్వడంతో ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆరోగ్యంపై ఇప్పుడు జైలు లోపల, బయట తీవ్ర చర్చ నడుస్తోంది.

జైల్లో ఉన్న ఆయనకు ప్రత్యేకంగా హై ప్రొటీన్ డైట్ అందించాలని వైద్యుల నుంచి సిఫారసు రావడం సరికొత్త వివాదానికి, పలు అనుమానాలకు దారితీసింది. సాధారణ ఖైదీలకు దక్కని ఈ ప్రత్యేక వైద్య సదుపాయం వెనుక ఏముందనే ఆరా తీయడంతో అసలు విషయాలు బయటకు వస్తున్నాయి.

బ్లడ్ టెస్టులుకు ఒప్పుకోని అనంతబాబు

అయితే, ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ వెలుగుచూసింది. సాధారణంగా ఒక వ్యక్తి శరీరంలో ఏవైనా లోపాలు లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడే వైద్యులు ఇటువంటి హై-ప్రొటీన్ ఫుడ్‌ను ప్రిస్క్రైబ్ చేస్తారు. కానీ, అనంతబాబు విషయంలో ఎలాంటి బ్లడ్ టెస్టులు జరగలేదని, దానికి సంబంధించిన నివేదికలు కూడా వైద్యులు జైలు అధికారులకు సమర్పించలేదని తెలుస్తోంది. చట్టప్రకారం ఖైదీ అయినా సరే, అతని అనుమతి ఉంటేనే రక్త నమూనాలను సేకరించి పరీక్షించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అనంతబాబు బ్లడ్ టెస్టులకు నిరాకరించడం, అయినా కూడా వైద్యులు ఆయనకు ఏ సమస్య ఉందో తెలీకుండానే హై ప్రొటీన్ డైట్ సిఫారసు చేయడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.

ఇమ్యూనిటీ పడిపోయే వాధి ఉందా?

తీవ్రమైన క్షయ , హెచ్‌ఐవీ లాంటి ఇమ్యూనిటీ పూర్తిగా పడిపోయే నయం కాని క్రానిక్ వ్యాధులు ఉంటేనే వైద్యులు రోగిని బ్రతికించుకోవడానికి అంతటి హై-ప్రొటీన్ డైట్‌ను ప్రత్యేకంగా రికమండ్ చేస్తారు. అనంతబాబు తనకు అసలు ఏ రోగం ఉందో బయటకు తెలియకుండా జైలు అధికారుల వద్ద దాస్తున్నారనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేకపోతే, రక్త పరీక్షలు చేయించుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారనేది పెద్ద ప్రశ్నగా మారింది. తన వ్యక్తిగత అనారోగ్య రహస్యాలను దాచుకోవాలనే తాపత్రయమే ఇటువంటి తీవ్రమైన పుకార్లకు కారణమవుతోంది.

గతంలోనే ఆయనకు నయం కాని వ్యాధి ఉందని ప్రచారం

గతంలో కూడా ఆయన జైల్లో ఉన్న సమయంలో ఆయనకు ఏదో నయం కాని దీర్ఘకాలిక వ్యాధి ఉందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఇప్పుడు జైల్లో జరుగుతున్న తాజా పరిణామాలు, బ్లడ్ టెస్టులు లేకుండానే తెచ్చుకున్న మెడికల్ రికమండేషన్లు చూస్తుంటే.. నాడు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు నిజమేనేమో అన్న ప్రచారం మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటూ సాక్షులను బెదిరించిన కేసులో లోపలికి వెళ్లిన ఈ ప్రజాప్రతినిధి, ఇలా జైలు లోపల తన అనారోగ్యం చుట్టూ దాగుడుమూతలు ఆడటం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360