Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అందరి కళ్లూ 'ఫౌజీ' గ్లింప్స్ పైనే..!

అందరి కళ్లూ 'ఫౌజీ' గ్లింప్స్ పైనే..!

Telugu 360 20 hrs ago

రేపు (అక్టోబరు 23) ప్రభాస్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రభాస్ 'ఫౌజీ' నుంచి గ్లింప్స్ రాబోతోంది. ఈ విషయాన్ని నిర్మాతలు ముందే ప్రకటించారు.

ఫౌజీ కాన్సెప్ట్ ఏమిటో, అందులో హీరో క్యారెక్టర్ ఏమిటో చెబుతూ కట్ చేసిన గ్లింప్స్ ఇది. ఫౌజీ ఎలా ఉండబోతోందన్న విషయంలో ఓ అవగాహన ఈ గ్లింప్స్ తో రావొచ్చు. దాంతోపాటుగా ఇదే గ్లింప్స్ లో రిలీజ్ డేట్ ని ఖరారు చేయబోతున్నారు. 2027 మార్చి 18న ఫౌజీని రిలీజ్ చేయాలన్నది ప్లాన్. ఈ గ్లింప్స్ లో రిలీజ్ డేట్ పై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ యేడాది డిసెంబరులో రావాల్సిన సిపిమా ఇది. కానీ.. చిత్రీకరణలో జాప్యం వల్ల వాయిదా పడింది. ఈసారి రిలీజ్ డేట్ ప్రకటిస్తే… వాయిదా వేసే ప్రసక్తే ఉండకూడదు. అందుకే రిలీజ్ డేట్ విషయంలో చిత్రబృందం ముందు జాగ్రత్త తీసుకొంది.

'ఫౌజీ'కి సంబంధించి ఇంత వరకూ పోస్టర్లు వచ్చాయి తప్ప, గ్లింప్స్ బయటకు రాలేదు. హను రాఘవపూడి టేకింగ్‌, ప్రభాస్ ని ఎలా చూపిస్తున్నాడు అనే విషయంలో ప్రభాస్ అభిమానుల్లో చాలా చాలా ఆసక్తి ఉంది. వాటన్నింటికీ ఈ గ్లింప్స్ తో ఓ సమాధానం దొరకబోతోంది. 'ఫౌజీ' అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏమిటో, ఆ టైటిల్ వెనుక కథేమిటో కూడా ఈ గ్లింప్స్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 'స్పిరిట్', 'కల్కి 2' నుంచి కూడా ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అన్నది ప్రభాస్ అభిమానుల ఆశ. 'స్పిరిట్' కి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ఇది వరకే చెప్పేశారు కాబట్టి.. కొత్త పోస్టరేమైనా రావొచ్చు. మరి 'కల్కి 2' నుంచి ఎలాంటి సర్‌ప్రైజ్ వస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360