Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అన్నాడీఎంకేను చీల్చే వ్యూహంలో విజయ్‌ ?

అన్నాడీఎంకేను చీల్చే వ్యూహంలో విజయ్‌ ?

Telugu 360 3 weeks ago

మిళనాడు రాజకీయాల్లో తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ వ్యూహాలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేవలం కొత్త పార్టీని స్థాపించడమే కాకుండా, సంప్రదాయ పార్టీ అయిన అన్నాడీఎంకేను బలహీనపరిచి, ఆ స్థానాన్ని భర్తీ చేసే దిశగా విజయ్ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

ముఖ్యంగా అన్నాడీఎంకేలోని మెజార్టీ ఎమ్మెల్యేలు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం ఆ పార్టీ అగ్రనేతల్లో కలవరాన్ని రేపుతోంది.

ఈ ఆపరేషన్ వెనుక అన్నాడీఎంకేకు చెందిన ఒక కీలక నేత హస్తం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. సదరు నేత ద్వారానే విజయ్ టీమ్ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో టచ్‌లోకి వెళ్తున్నట్లు సమాచారం. ప్రస్తుత నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న వారు, విజయ్ క్రేజ్‌ను చూసి ఆకర్షితులవుతున్న వారు తమ భవిష్యత్తు కోసం టీవీకే వైపు చూస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఈ చీలిక గనుక జరిగితే, తమిళనాడులో విజయ్ మంచి మెజార్టీతో ప్రభుత్వాన్ని నడపగలుగుతారు. ప్రతిపక్షంగా డీఎంకే ఉంటుంది.

విజయ్ వ్యూహం కేవలం ఎమ్మెల్యేలను లాక్కోవడం మాత్రమే కాదు, అన్నాడీఎంకే కేడర్‌ను కూడా తమ వైపు తిప్పుకోవడం. గతంలో ఎంజీఆర్, జయలలిత వంటి మాస్ లీడర్లను ఆరాధించిన ఓటర్లకు విజయ్ ఒక సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే అన్నాడీఎంకేలోని ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా టీవీకే వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యేలా చేయనున్నారు. ప్రస్తుతానికి అన్నాడీఎంకే నేతలతో విజయ్ వ్యూహకర్తలు చర్చలు జరుపుతున్నారు. రెండు, మూడు రోజుల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360