Dailyhunt
'బైకర్‌' కోసం శర్వా డబ్బులు పెట్టాడా?

'బైకర్‌' కోసం శర్వా డబ్బులు పెట్టాడా?

Telugu 360 1 week ago

యేడాది శర్వానంద్ కి బాగానే కలిసొస్తోంది. సంక్రాంతికి వచ్చిన `నారీ నారీ నడుమ మురారి` మంచి విజయాన్ని అందుకొంది. ఈ శుక్రవారం విడుదలైన 'బైకర్‌' కి పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి.

వసూళ్లు కూడా నిలకడగా ఉన్నాయి. శర్వా లుక్ కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. టెక్నికల్ గా కూడా ఈ సినిమా స్ట్రాంగ్ గా ఉంది. కెమెరా వర్క్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ కి మంచి మార్కులు పడ్డాయి. సినిమా కోసం నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు తెరపై కనిపిస్తోంది.

ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మించింది. యూవీలో శ్వర్వాకి ఇది నాలుగో సినిమా ఇది వరకు రన్ రాజా రన్‌, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు సినిమాలు వచ్చాయి. అవి మూడూ హిట్లే. అయితే ఈసారి శర్వా కూడా తన వంతుగా సినిమాలో పెట్టుబడి పెట్టాడని తెలుస్తోంది. 'బైకర్‌' లాంటి సినిమాకు భారీ బడ్జెట్ అవసరం. ఈ సినిమా ఒప్పుకొనేటప్పుడు శర్వా కెరీర్ కొంత ఒడిదుడుకుల్లో ఉంది. అలాంటప్పుడు 'బైకర్‌'పై భారీగా ఖర్చు పెట్టడం నిర్మాతలకు రిస్కే. దాన్ని గ్రహించిన శర్వానంద్ సినిమాలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాడట. తాను పారితోషికం తీసుకోకుండా, ఎదురు పెట్టుబడి పెట్టాడని, ఇప్పుడు లాభాల్లో వాటా అందుకొంటున్నాడని తెలుస్తోంది. హీరోలకు నచ్చిన కథలు వచ్చినప్పుడు, అలాంటి కథల్ని తెరపైకి తీసుకెళ్లడం రిస్క్ అని నిర్మాతలు భయపడుతున్నప్పుడు హీరోలు ఇలా ఓ చేయి వేసి, ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లడం మంచి విషయమే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360