Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బన్నీని మూడు రకాలుగా చూడబోతున్నామా?

బన్నీని మూడు రకాలుగా చూడబోతున్నామా?

Telugu 360 3 weeks ago

కాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి రాబోతున్న సినిమా 'రాకా'. అట్లీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే అంచనాలు పెంచుతోంది.

ఫస్ట్ లుక్‌లోనే బన్నీని ఎప్పుడూ చూడని లుక్‌లో చూపించిన అట్లీ.. సినిమాలో పాత్రల విషయంలో కూడా అదే స్థాయిలో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా 'రాకా'లో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడనే వార్త ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. గతంలోనూ బన్నీ తండ్రి, ఇద్దరు కొడుకులుగా కనిపిస్తాడనే ప్రచారం వచ్చింది. తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ కూడా ఇదే దిశగా ఉంది. అంటే.. సినిమాలో ఒకే హీరోను మూడు విభిన్న కోణాల్లో చూడబోతున్నామన్ మూడు పాత్రల్లో అల్లు అర్జున్ తండ్రి పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని సమాచారం. సాధారణంగా తండ్రి పాత్ర అంటే హీరోకి వయసు పెంచి చూపించడం మాత్రమే కాకుండా.. ఈ క్యారెక్టర్‌కు కథలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని టాక్.

ఇక ఇద్దరు కొడుకుల పాత్రలు కూడా ఒకేలా ఉండవట. ఇద్దరి క్యారెక్టరైజేషన్స్, బాడీ లాంగ్వేజ్, లుక్స్, ఎమోషన్స్ పూర్తిగా భిన్నంగా ఉండేలా అట్లీ డిజైన్ చేశాడని చెబుతున్నారు.

అంటే మూడు పాత్రలు కేవలం మూడు గెటప్స్‌లా కాకుండా.. మూడు భిన్నమైన వ్యక్తిత్వాలుగా కనిపించనున్నాయన్నమాట.

ఇక ఈ వార్తల్లో అందరికంటే ఆసక్తిని పెంచుతున్న మరో అంశం.. మూడు పాత్రల్లో ఒకటి పూర్తిగా నెగెటివ్ షేడ్స్‌లో ఉండబోతోందట.

'రాకా' ఫస్ట్ లుక్‌లో కనిపించిన బీస్ట్ లుక్ కూడా ఈ నెగెటివ్ క్యారెక్టర్‌కు సంబంధించినదేనా అన్న చర్చ ఇప్పటికే జరుగుతోంది. బన్నీ ఆ లుక్‌లో కనిపించిన తీరు చూస్తే.. ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలన్నింటికంటే ఇది చాలా భిన్నంగా ఉండబోతుందనే ఫీలింగ్ కలుగుతోంది.

నెగెటివ్ పాత్రను కూడా బన్నీ తనదైన స్టైల్లో పెర్ఫార్మ్ చేస్తే.. ఆ క్యారెక్టర్ సినిమాకే హైలైట్‌గా మారే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ఇప్పటివరకు మల్టిపుల్ రోల్స్ చేసిన హీరోగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. 'రాకా'లో నిజంగానే తండ్రి, ఇద్దరు కొడుకులుగా మూడు పాత్రలు చేస్తే.. ఇది ఆయన కెరీర్‌లోనే ఒక కొత్త ప్రయోగం అవుతుంది.

అందులోనూ ఒకే సినిమాలో మూడు పాత్రలకు మూడు వేరియేషన్స్ చూపించడం అంటే నటుడిగా బన్నీకి కూడా ఇది పెద్ద ఛాలెంజే.

అట్లీ సినిమాల్లో మల్టిపుల్ క్యారెక్టర్లు, ఎమోషనల్ కనెక్ట్, కమర్షియల్ ఎలివేషన్స్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి స్టార్‌ను మూడు పాత్రల్లో చూపిస్తే.. ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటివరకు 'రాకా' గురించి బయటకు వచ్చిన విషయాల్లో చాలా వరకు టాక్, రూమర్స్ స్థాయిలోనే ఉన్నాయి. అధికారికంగా మేకర్స్ కథ, పాత్రల వివరాలను వెల్లడించలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360