కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను తుపాను సృష్టించింది.
ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం అర్థరాత్రి వరకు ఉత్కంఠభరితంగా సాగిన విచారణలో హైకోర్టు మధ్యంతర ఉపశమనం ఇచ్చేందుకు నిరాకరించింది. ఇప్పుడు భగీరథ్ ముందు అరెస్టా? లేక లొంగుబాటా? అనే రెండు మార్గాలు మాత్రమే మిగిలాయి. లొంగుబాటు అనేది కాస్త గౌరవంగా ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
హైకోర్టు నుంచి ఎలాంటి రక్షణ లభించకపోవడంతో, శనివారం భగీరథ్ నేరుగా పోలీసుల ముందు లొంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ, పోలీస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ కుటుంబం.. చట్టాన్ని గౌరవిస్తామని చెప్తున్న తరుణంలో, పోలీసులు వెతికి పట్టుకుని అరెస్ట్ చేయడం కంటే తామే స్వయంగా పోలీసుల ముందుకు వెళ్లడం బెటర్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పేట్‌బషీరాబాద్ పోలీసులు భగీరథ్‌కు నోటీసులు జారీ చేసినందున మరింత రాజకీయ నష్టం జరగకుండా ఉండేందుకే ఈ లొంగుబాటు వ్యూహాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.
మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమగ్ర విచారణ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఒకవేళ భగీరథ్ స్వయంగా హాజరు కాకపోతే, పోలీసులు ఏ క్షణంలోనైనా ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 5, 6 కింద నమోదైన కేసులు అత్యంత కఠినమైనవి కావడం, నాన్-బైలబుల్ కావడం వల్ల భగీరథ్ పోలీసుల ముందుకు రాగానే అరెస్ట్ చూపించి రిమాండ్‌కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భగీరథ్ కోసం ఐదు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

