Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భగీరథ్ సరెండర్ !

భగీరథ్ సరెండర్ !

Telugu 360 1 week ago

పోక్సో కేసులో బండి సాయి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ కేసు నమోదైన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు నేరుగా వచ్చి లొంగిపోవడంతో గత కొన్ని రోజులుగా సాగుతున్న హైడ్రామాకు తెరపడింది.

హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి ఉపశమనం లభించకపోవడం, మరోవైపు బాధితురాలు మైనర్ అని అధికారిక రికార్డుల ద్వారా కన్ఫర్మ్ కావడంతో భగీరథ్‌కు జైలు జీవితం తప్పనిసరి అయింది.

భగీరథ్ కోసం సైబరాబాద్ పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని, లుక్-అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేశామని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆయన నేరుగా స్టేషన్‌కు వచ్చి సరెండర్ అయ్యారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో పోలీసులు అరెస్ట్ విషయంలో కొంత సాఫ్ట్ అప్రోచ్ అవలంబించారని, ఆయన స్వయంగా వచ్చి లొంగిపోయేందుకే సమయం ఇచ్చారనే అభిప్రాయం వినిపిస్తోంది. లొకేషన్ ట్రేసింగ్, సీడీఆర్ డేటా ఉన్నా పోలీసులు నేరుగా పట్టుకోకుండా, కేవలం పైపైనే వెతికినట్లు కనిపించారని అంటున్నారు.

శుక్రవారం అర్ధరాత్రి వరకు సాగిన హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణలో భగీరథ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని, బాధితురాలి వయస్సు పరంగా నిబంధనలు వర్తిస్తాయని భావించిన కోర్టు ఎలాంటి అరెస్ట్ స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. చట్టపరంగా లీగల్ రక్షణ దొరికే అన్ని దారులు మూసుకుపోవడంతో, ఇక పోలీసులకు దొరికిపోవడం కంటే లొంగిపోవడమే ఉత్తమమని భావించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

మొదట్లో ఈ కేసును రూ. 5 కోట్ల హనీట్రాప్, బ్లాక్‌మెయిలింగ్ అంటూ నిందితుల వర్గం కొట్టిపారేసే ప్రయత్నం చేసింది పోక్సో చట్టం ప్రకారం మైనర్ల విషయంలో పరస్పర అంగీకారం అనే వాదనకు కోర్టుల్లో తావుండదు. గ్రేవర్ మరియు నాన్-బైలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు కావడంతో, పోలీసులు భగీరథ్‌ను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల అనంతరం కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360