Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భగీరథ్‌ను అరెస్ట్ చేశారా? సరెండర్ అయ్యాడా?

భగీరథ్‌ను అరెస్ట్ చేశారా? సరెండర్ అయ్యాడా?

Telugu 360 1 week ago

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ అరెస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు హైడ్రామాగా మారింది. ఒకవైపు సైబరాబాద్ సీపీ రమేష్ మేమే భగీరథ్‌ను అప్పా జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశాం అని అధికారికంగా ప్రకటిస్తుంటే, మరోవైపు బండి సంజయ్ మాత్రం చట్టంపై గౌరవంతో మా లీగల్ టీమ్ ద్వారా మేమే స్వయంగా అప్పగించాం అని స్పష్టం చేస్తున్నారు.

అప్పా జంక్షన్ వద్ద లీగల్ హైడ్రామా.. అసలు ఏం జరిగింది?

హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన తర్వాత భగీరథ్‌ను పట్టుకునేందుకు పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలో శనివారం అప్పా జంక్షన్ సమీపంలో పోలీసులు భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్న దృశ్యాలు , వీడియోలు కూడా మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. నిందితుడు లొంగిపోయాడనేది అబద్ధం.. నార్సింగి పరిధిలో మా బృందాలే ఆయన్ను చేజ్ చేసి అరెస్ట్ చేశాయి అని సీపీ రమేష్ రెడ్డి గట్టిగా వాదిస్తున్నారు.

మేమే చట్టానికి అప్పగించాం - బండి సంజయ్ కౌంటర్

పోలీసుల ప్రకటనకు భిన్నంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. తన కుమారుడు ఎలాంటి తప్పూ చేయలేదని చెప్తున్నా, న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకంతో తామే లాయర్ల ద్వారా పోలీసులకు అప్పగించామని ఆయన వెల్లడించారు. చట్టం ముందు నా బిడ్డయినా, సామాన్యుడైనా ఒకటే. బెయిల్ వస్తుందని లాయర్లు చెప్తున్నా విచారణ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో మేమే స్వయంగా పంపించాం అని సంజయ్ పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారంలో ఎవరి వెర్షన్ నిజమనే సస్పెన్స్ మొదలైంది.

రెండు వర్గాల సేఫ్ గేమ్ వ్యూహాలు!

రా ఇక్కడ రెండు వర్గాలు కూడా తమ పరిధిలో మైలేజ్ కోసం సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక కేంద్ర మంత్రి కుమారుడు పరారీలో ఉంటే పట్టుకోలేకపోయారనే నింద పడకుండా ఉండేందుకు.. పోలీసులు తామే పక్కా స్కెచ్‌తో చేజ్ చేసి అరెస్ట్ చేశామని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు, పోలీసులు వెతికి పట్టుకుని ఈడ్చుకెళ్లారనే బ్యాడ్ నేమ్ రాకుండా, మేమే చట్టాన్ని గౌరవించి లొంగిపోయాం అని చెప్పుకోవడం ద్వారా పొలిటికల్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలని బండి సంజయ్ క్యాంప్ భావిస్తోంది.

లొంగుబాటుకు.. అరెస్టుకు మధ్య సమన్వయం?

నిజానికి, అప్పా జంక్షన్ వద్ద పోలీసులు భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్నది అక్షరాలా నిజం. అయితే, లీగల్ టీమ్ , కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆయన్ను పోలీసు వాహనం ఎక్కించినట్లు తెలుస్తోంది. అంటే, కుటుంబ సభ్యులు ఆయన్ను పోలీసులకు అప్పగించడానికి తీసుకువస్తుండగా.. పోలీసులు మధ్యలోనే తామే అదుపులోకి తీసుకున్నట్లు రికార్డుల్లో చూపించారనే చర్చ నడుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360