Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భగీరథ్‌పై మరిన్ని కఠినమైన సెక్షన్లు

భగీరథ్‌పై మరిన్ని కఠినమైన సెక్షన్లు

Telugu 360 6 days ago

బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో చట్టపరంగా మరో ఊహించని మలుపు తిరిగింది. ఈ వివాదంలో విచారణను మరింత తీవ్రతరం చేసిన పోలీసులు, ప్రాథమిక ఆరోపణల కంటే అత్యంత కఠినమైన సెక్షన్లను కొత్తగా జోడించారు.

బాధితురాలి స్టేట్‌మెంట్, వైద్య పరీక్షలు , సేకరించిన ప్రాథమిక ఆధారాలను బేస్ చేసుకుని దర్యాప్తు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

పోలీసులు భగీరథ్‌పై భారతీయ న్యాయ సంహిత లోని అత్యంత కఠినమైన సెక్షన్ 64(2)(m)ను అదనంగా చేర్చారు. ఒకే బాధితురాలిపై ఒకే వ్యక్తి పలుమార్లు లేదా వరుసగా అత్యాచారానికి ఒడిగట్టినప్పుడు ఈ నిర్దేశిత సెక్షన్‌ను వర్తింపజేస్తారు. సాధారణ కేసులతో పోలిస్తే ఈ సెక్షన్ కింద బెయిల్ రావడం కష్టమవ్వడమే కాకుండా, జీవిత ఖైదు లేదా అంతకంటే తీవ్రమైన శిక్షలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే పోక్సో చట్టం కింద విచారణ ఎదుర్కొంటున్న తరుణంలో ఈ కొత్త సెక్షన్ చేరడం ఆయనను మరింత డిఫెన్స్‌లోకి నెట్టింది.

ఈ కేసులో పోలీసులు పక్కా ఆధారాలతో, ఎక్కడా లూప్‌హోల్స్ లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. బాధితురాలికి జరిగిన నష్ట తీవ్రతను బట్టి, చట్టం ముందు ఎవరైనా సమానులే అనే సంకేతాన్ని ఇచ్చేలా దర్యాప్తు అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో, రాజకీయ వేదికలపై ఈ అంశంపై ఎంతగా విమర్శల యుద్ధం నడుస్తున్నప్పటికీ.. తాము మాత్రం కేవలం న్యాయపరమైన సాక్ష్యాధారాల ప్రకారమే సెక్షన్లను పొడిగిస్తూ కేసును బలోపేతం చేస్తున్నామని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360