బండి భగీరథ్ పోక్ోస కేసు వివాదం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని, అవసరమైతే ఆయనను బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అయితే, బీఆర్ఎస్ చేస్తున్న ఈ డిమాండ్లపై భారతీయ జనతా పార్టీ శ్రేణులు, నాయకులు అంతే ఘాటుగా మండిపడుతున్నారు.
బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొడుతూ బీజేపీ నేతలు సరికొత్త కౌంటర్లు ఇస్తున్నారు. బండి భగీరథ్‌పై కేసు నమోదైన తర్వాత ఆయన చట్టాన్ని గౌరవించాడని, న్యాయపోరాటం చేశాడని గుర్తు చేస్తున్నారు. కోర్టుల్లో న్యాయపోరాటం సాధ్యం కాకపోవడంతో చట్టప్రకారం బండి భగీరథ్ కోర్టుకు సరెండర్ అయిపోయాడని, చట్టం తన పని తాను చేసుకుపోతుంటే ఇందులో బండి సంజయ్ తప్పు ఎక్కడుందని బీజేపీ ప్రశ్నిస్తోంది. కుమారుడు చేసిన పొరపాటుకు తండ్రి ఎలా బాధ్యుడవుతాడని, ఇందులో రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని గా బీజేపీ మద్దతుదారులు నిలదీస్తున్నారు.
ఇదే క్రమంలో బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు పాత విషయాలను తెరపైకి తెచ్చారు. గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి జైలుకు వెళ్లినప్పుడు.. ఆ నైతిక బాధ్యత వహిస్తూ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, నాటి మంత్రి కేటీఆర్ కానీ ఎందుకు రాజీనామా చేయలేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరరావు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. సొంత కుటుంబ సభ్యులే అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్తే పదవుల్లో కొనసాగిన బీఆర్ఎస్ నేతలకు, ఇప్పుడు బండి సంజయ్‌ను రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు లేదని బీజేపీ విమర్శిస్తోంది.
ప్రస్తుతం ఈ అంశం అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ మద్దతుదారులు బండి సంజయ్ తీరును తప్పుబడుతూ ట్రోల్స్ చేస్తుంటే, బీజేపీ శ్రేణులు కవిత జైలు ఎపిసోడ్‌ను గుర్తు చేస్తూ గట్టిగా కౌంటర్ ఇస్తున్నాయి. మొత్తానికి, విద్యార్థుల మధ్య జరిగిన గొడవ కాస్తా.. తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య ఊహించని స్థాయి రాజకీయ యుద్ధానికి దారి తీస్తోంది.

