Dailyhunt
Buzz: త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్‌

Buzz: త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్‌

Telugu 360 3 weeks ago

టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇటీవలే విజయ్ - రష్మిక పెళ్లి చేసుకొన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి కూడా ఖాయమైంది. ఈనెల 5న నిశ్చితార్థం.

నెలాఖరున పెళ్లి. ఇప్పుడు మరో కథానాయిక కూడా పెళ్లి పీటలెక్కబోతోందని తెలుస్తోంది.

మంచి పాత్రలు, మంచి కథలు, విజయవంతమైన చిత్రాలతో కెరీర్‌ని నడిపిస్తున్న అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించిందని తెలుస్తోంది. అనుపమ పెళ్లి ఖాయమైందని వచ్చే నెలలో నిశ్చితార్థం జరగబోతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుపమ కెరీర్ ఇప్పుడు మంచి దశలోనే ఉంది. ఇలాంటి తరుణంలోనే వ్యక్తిగత జీవితంలోనూ స్థిరపడాలనుకొంటోందేమో? అనుపమ పెళ్లి కూడా ఇండస్ట్రీ కి సంబంధించిన వ్యక్తితోనే జరగబోతోందన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ఇది ప్రేమ పెళ్లా, పెద్దలు కుదిర్చిన వివాహమా? అనేది తెలియాల్సివుంది.

కథానాయికల పెళ్లికి సంబంధించిన వార్తలు బయటకు రావడం, ఆ తరవాత వాటిలో కొన్ని నిజం అవ్వడం, ఇంకొన్ని గాసిప్పులుగా మిగిలిపోవడం జరుగుతున్న విషయాలే. మరి అనుపమ పెళ్లి వార్త నిజమేనా, లేదంటే కేవలం ఊహాగానమా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360