Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చీర.. చొక్క.. చిక్కెడిపోయే పాట

చీర.. చొక్క.. చిక్కెడిపోయే పాట

Telugu 360 2 days ago

రామ్ చరణ్ 'పెద్ది' పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. విడుదలైన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా, ఇప్పుడు చిత్రబృందం మరో మాస్ సర్‌ప్రైజ్‌తో ముందుకొచ్చింది.

'హల్లో హల్లో' అంటూ సాగే ప్రత్యేక గీతం ప్రోమోను విడుదల చేసింది. కేవలం 40 సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రోమోలోనే పాట మాస్ పల్స్‌ను ఎంత బలంగా పట్టుకుందో అర్థమవుతోంది. "చీర.. చొక్క.. చిక్కెడిపోవాలో.." అంటూ సాగే లిరిక్స్‌కు రామ్ చరణ్, శ్రుతి హాసన్ వేసిన స్టెప్పులు అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా శ్రుతి హాసన్ గ్లామర్, ఎనర్జీతో కూడిన డ్యాన్స్ మూమెంట్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇప్పటికే 'పెద్ది' నుంచి విడుదలైన 'చికిరి, రైరై రారా.. రెండు పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. రూరల్ నేటివిటీ, మాస్ బీట్‌లతో వచ్చిన ఆ పాటలు ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లాయి. ఇప్పుడు 'హల్లో హల్లో' ప్రోమో చూసిన తర్వాత మూడో పాట కూడా అదే స్థాయిలో చార్ట్‌బస్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

'పెద్ది'లాంటి మాస్ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ సంగీత దర్శకుడిగా ఎంపిక కావడం మొదట్లో చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే విడుదలైన పాటలతోనే రెహమాన్ తనదైన శైలిలో మాస్ బీట్‌లను అందించగలనని మరోసారి నిరూపించారు. ఇప్పుడు 'హల్లో హల్లో' ప్రోమో కూడా అదే విషయాన్ని మరోసారి రుజువు చేసింది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే రిథమ్‌తో ఈ పాటను రెహమాన్ స్వరపరిచారు. ఈ పూర్తి పాటను భోపాల్‌లో జరగనున్న ఏ.ఆర్. రెహమాన్ లైవ్ కాన్సర్ట్ వేదికగా విడుదల చేయనున్నారు, మొత్తనికి పెద్ది' టీమ్ అభిమానులు కోరుకునే మాస్ ఆల్బమ్‌ను అందించడంలో విజయవంతమైందనే చెప్పాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360