Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దటీజ్ అదానీ - సూపర్ క్లీన్ !

దటీజ్ అదానీ - సూపర్ క్లీన్ !

Telugu 360 6 days ago

భారతీయ కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీ చుట్టూ అంతర్జాతీయంగా, దేశీయంగా నడిచిన చట్టపరమైన వివాదాలు, ఆరోపణలు అన్నీ తేలిపోయాయి. మెరికాలో అదానీ గ్రూప్‌పై నమోదైన సంచలన లంచం ఆరోపణల కేసులో తగిన ఆధారాలు లేవని అక్కడి దర్యాప్తు సంస్థలు విచారణను ముగించాయి.

నిజానికి అన్ని ఆధారాలు ఉన్నాయనే కేసు పెట్టారు. లంచం కేసు వీగిపోవడంతో పాటు, గతంలో ఇరాన్‌కు సంబంధించిన గ్యాస్ దిగుమతి నిబంధనల వివాదాన్ని కూడా అదానీ గ్రూప్ రెండున్నర వేల కోట్ల వరకూ జరిమానా చెల్లించి చట్టబద్ధంగా పరిష్కరించుకుంది.

అదానీకి ఎలాగైనా బయటపడిపోతారు!

అమెరికా న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలు తంలో అదానీపై మోపిన లంచం ఆరోపణల కేసును తగిన సాక్ష్యాధారాలు లేవనే కారణంతో ముగించడం కేవలం ఒక వ్యాపార సంస్థకు లభించిన చట్టపరమైన క్లీన్‌చిట్ మాత్రమే కాదు; అది గ్లోబల్ క్యాపిటలిజంలో అదానీ గ్రూప్ ఆర్థిక శక్తికి నిదర్శనం. లంచం కేసు వీగిపోవడం ఒక ఎత్తయితే, సరిగ్గా అదే సమయంలో అమెరికా ఇంధన, మౌలిక వసతుల రంగంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనను అదానీ గ్రూప్ ముందుకు తెచ్చింది. ఇవి రెండు వేర్వేరు చట్టపరమైన, వాణిజ్యపరమైన అంశాలైనప్పటికీ, అంతర్జాతీయ దౌత్య, ఆర్థిక వేదికలపై అదానీ ప్రభావాన్ని ఇవి స్పష్టం చేస్తున్నాయి.

ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తే, అంతర్జాతీయ మార్కెట్లలో వివాదాలు ఎదురైనప్పుడు చట్టాల్లోని లూప్‌హోల్స్ , సెటిల్మెంట్ పద్ధతులను అదానీ గ్రూప్ ఎంత చాకచక్యంగా ఉపయోగించుకోగలదో అర్థమవుతుంది.

ఇండియాలో బయటపడటం కష్టమా?

భారతదేశంలో ప్రతిపక్షాలు అదేపనిగా దేశీయ దర్యాప్తు సంస్థలైన ఈడీ , సీబీఐ లు అదానీపై చర్యలు తీసుకోవడం లేదని, ప్రభుత్వ అండతోనే ఆయన బతికిపోతున్నారని విమర్శలు గుప్పిస్తుంటాయి. కానీ, అసలు వాస్తవమేమిటంటే, కేవలం భారతీయ సంస్థలే కాదు, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవని భావించే అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా పక్కా చట్టపరమైన ఆధారాలు లేకుండా అదానీ సామ్రాజ్యాన్ని ఇరుకున పెట్టలేవు. కార్పొరేట్ చట్టాలు, గ్లోబల్ ఫైనాన్షియల్ స్ట్రక్చర్‌పై అదానీ గ్రూప్‌కు ఉన్న పట్టు అంత సామాన్యమైనది కాదు. అంతర్జాతీయ పెట్టుబడులు, పోర్టులు, ఎనర్జీ సెక్టార్, డేటా సెంటర్లు , మౌలిక వసతుల కల్పనలో అదానీ గ్రూప్ వ్యూహాత్మక ప్రాధాన్యతను కలిగి ఉంది. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా, అభివృద్ధి ప్రణాళికలకైనా ఇటువంటి మెగా కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యం అవసరమౌతుంది. అందువల్లనే, ఆరోపణలు ఎన్ని వచ్చినా, అంతర్జాతీయ న్యాయస్థానాల పరిధిలో అవి వీగిపోవడమో లేదా సెటిల్మెంట్ల రూపంలో ముగిసిపోవడమో జరుగుతోంది. ఈ గ్లోబల్ లీగల్ మెకానిజంను అర్థం చేసుకున్న ఏ దర్యాప్తు సంస్థ అయినా, తగిన గ్రౌండ్ వర్క్ లేకుండా అదానీపై ముందడుగు వేయడానికి వెనుకాడుతుంది.

దేశంలో అదానితో లొల్లి పెట్టుకునే రాజకీయ నేతలది తప్పిదమే

రాజకీయంగా అత్యంత పరిణతి, వ్యూహాత్మక చతురత ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా అదానీని క్షేత్రస్థాయిలో నేరుగా ఢీకొట్టడానికి ఇష్టపడరు. కేవలం ఎన్నికల ప్రచారం కోసం, ప్రజల్లో పొలిటికల్ మైలేజ్ కోసం పైపైన విమర్శలు చేయడం వేరు, కానీ వ్యవస్థాగతంగా అదానీ ఆర్థిక సామ్రాజ్యానికి ఎదురెళ్లడం వల్ల జరిగే నష్టాన్ని వారు ముందే ఊహిస్తారు. ఎందుకంటే, అదానీ కేవలం ఒక వ్యక్తి కాదు. దేశీయ , అంతర్జాతీయ మౌలిక వసతుల కల్పనలో భాగమైన ఒక వ్యవస్థ. రాష్ట్రాలలో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ఉపాధి కల్పన, పారిశ్రామికాభివృద్ధి, ఓడరేవుల నిర్వహణ వంటి కీలక రంగాల కోసం అదానీ గ్రూప్‌తో చేతులు కలపక తప్పని పరిస్థితి నేడు దేశంలో నెలకొంది.

అదానీ చేస్తున్నదంతా కరెక్టేనా?

అయితే అదానీ చేస్తున్నదంతా కరెక్టేనా అని ఎవరూ చెప్పలేరు. హిండెన్‌బర్గ్ నివేదిక నుండి అమెరికా లంచం కేసుల వరకు-అదానీ గ్రూప్ ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుంటూ మరింత బలంగా పైకి లేచింది. కానీ తాము చట్టబద్ధంగా అన్నీ చేస్తున్నామని ధైర్యంగా చెప్పుకోలేకపోయింది. గా రాజకీయ విమర్శల హోరు ఎంతగా వినిపించినా, గ్లోబల్ లీగల్ సిస్టమ్‌లో తనకున్న పట్టుతో, లీగల్ బ్యాటిల్స్‌ను ఎలా గెలవాలో అదానీ నిరూపించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360