Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధోని 'నిశ్శబ్ద' వీడ్కోలు

ధోని 'నిశ్శబ్ద' వీడ్కోలు

Telugu 360 2 days ago

పీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ఈ సీజన్‌ కి ముగిసింది. గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో సీఎస్‌కే టోర్నీ నుంచి బయటికి వచ్చింది. నిజానికి చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలు తక్కువ.

ఒకవేళ ఈ మ్యాచ్ గెలిచినా.. మిగతా టీమ్స్ ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. టెక్నికల్ గా ఈ ఓటమితో బయటికి వచ్చింది కానీ లాజికల్ గా వారం క్రితమే అవకాశం తగ్గిపోయింది.

అయితే ప్లే అఫ్ ఫలితానికంటే అభిమానులను ఎక్కువగా చర్చించుకున్న అంశం ఎంఎస్ ధోని రిటైర్మెంట్. సీఎస్‌కే అంటేనే ధోని. ఐదు సార్లు జట్టుకు టైటిల్ అందించిన ధోని గత కొన్ని సీజన్లుగా పరిమిత పాత్రలోనే కనిపిస్తున్నాడు. మోకాలి గాయం, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా పూర్తి స్థాయిలో ఆడలేకపోయినా, చివరి ఓవర్లలో బ్యాటింగ్‌కు వచ్చి అభిమానులని అలరించేవాడు. ఈసారి మాత్రం పరిస్థితి ఇంకా మారింది. టోర్నీ ఆరంభం నుంచి ధోని బరిలోకి దిగలేదు. చెన్నై హోం గ్రౌండ్ లో ఆడిన చివరి మ్యాచ్ లో రిటైర్మెంట్ నిర్ణయం అతడే ప్రకటిస్తాడని ఊహాగానాలు వచ్చాయి. కానీ అలా జగరలేదు.

ప్రస్తుతం చూస్తే ధోని ఆటపై స్పష్టత లేదు. మరో సీజన్ ఆడతాడా? లేక ఇదే చివరి సీజన్ నా ? అన్న ప్రశ్నలకు సమాధానం సరైన సమాధానం లేదు. కాకపోతే ధోని గురించి తెలిసన వారు మాత్రం.. ధోని ఐపిఎల్ వీడ్కోలు ఎలాంటి హంగామా లేకుండా ఉంటుందని, గతంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పినప్పుడు కూడా ఎలాంటి హడావుడి లేకుండా ఒక్క సోషల్ మీడియా పోస్టుతో తన నిర్ణయాన్ని వెల్లడించాడని గుర్తు చేస్తున్నారు. ఐపీఎల్‌ విషయంలో కూడా ధోని ఇలానే సైలంట్ రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్స్ వుందని చెబుతున్నారు. కాకపోతే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కి ధోని ఆటని మైదానంలో ప్రత్యేక్షంగా వీక్షిస్తూ ఘనంగా వీడ్కోలు పలకాని కోరిక. ఆ కోరిక తీరుతుందో లేదో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360