మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'డ్రాగన్' నుంచి ఓ సర్‌ప్రైజ్ రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తున్నారు.
గ్లింప్స్ అంటే… అట్టాంటిట్టాంటి గ్లింప్స్ కాదు. దాదాపు 4 నిమిషాల 30 సెకన్ల పాటు సాగే గ్లింప్స్ ఇది. సాధారణంగా గ్లింప్స్ అన్నీ 60 సెకన్ల లోపే ముగిసిపోతాయి. టీజర్ కూడా నిమిషం నిడివి ఉండడం లేదు. అలాంటిది గ్లింప్స్ ని ఇంత లెంగ్తీగా కట్ చేశారంటే షాకింగ్ విషయమే. ఇప్పటికే గ్లింప్స్ కి సంబంధించిన సెన్సార్ కూడా పూర్తయ్యింది. ఈ నాలుగున్నర నిమిషాల్లో ప్రశాంత్ నీల్ ఏం చూపించబోతున్నాడా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ప్రశాంత్ నీల్ సినిమాల్లో వరల్డ్ బిల్డింగ్ ఎక్కువగా ఉంటుంది. కథ జరుగుతున్న ప్రాంతానికీ ఓ కథ ఉంటుంది. బ్యాక్ డ్రాప్ కూడా ఓ క్యారెక్టర్ గా మారిపోతుంది. 'డ్రాగన్' కూడా ఇలాంటి కథే. డ్రాగన్ నేపథ్యాన్ని, ఆ ప్రాంత కథని, క్యారెక్టర్లని పరిచయం చేస్తూ ఈ గ్లింప్స్ కట్ చేశారని తెలుస్తోంది. అందుకే రన్ టైమ్ అంత వచ్చింది. అయితే… ప్రతీ ఫ్రేమూ ఇంపాక్టబుల్ గా రావడానికి చిత్రబృందం కష్టపడిందని తెలుస్తోంది. `నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్` ఇవ్వడానికి ప్రశాంత్ నీల్ కష్టపడ్డాడని, ఎన్టీఆర్ అభిమానులకు ఇది పర్‌ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్ అని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
మాఫియా నేపథ్యంలో సాగే కథ ఇది. అలాగని రెగ్యులర్ ఫార్మెట్లో ఉండదని, కొత్త తరహా ప్రపంచాన్ని ప్రశాంత్ నీల్ పరిచయం చేస్తున్నారని సమాచారం. ఆ కొత్త తరహా ప్రయత్నం ఏమిటన్నది గ్లింప్స్ తో తేలిపోతుంది.

