ప్రశాంత్ నీల్ తీసిన `కేజీఎఫ్` రెండు భాగాలుగా వచ్చింది. 'సలార్' కి పార్ట్ 2 ఉంది. ఇప్పుడు 'డ్రాగన్' పరిస్థితి కూడా ఇదేనా?
అనేది ఎన్టీఆర్ అభిమానుల ముందున్న ప్రశ్న. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ మంగళవారం రాత్రి విడుదల చేసింది చిత్రబృందం. అయితే ఈ గ్లింప్స్ లో 'డ్రాగన్' అనేది రెండు పార్టుల సినిమానా, సింగిల్ సినిమానా అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. 'సలార్', 'కేజీఎఫ్' లకు అలా కాదు. ఆ సినిమాలకు సంబంధించిన గ్లింప్స్ వచ్చినప్పుడే పార్ట్ 2 ఉంటుందన్న హింట్ ఇచ్చాడు. ఈసారి అలా జరగలేదు.
దాంతో 'డ్రాగన్' సింగిల్ సినిమానే, సీక్వెల్ లేదు అనుకొంటున్నారు ఫ్యాన్స్. అయితే… 'డ్రాగన్' చిత్రానికి సీక్వెల్ లేకపోలేదని, ప్రశాంత్ నీల్ ఈ సినిమా విషయంలోనూ తన సెంటిమెంట్ ని వదులుకోడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. 'డ్రాగన్' ప్రాజెక్ట్ మొదలుపెట్టేటప్పుడు ఫ్రాంచైజీ చేయాలన్న ఆలోచన లేదని, అయితే ఆ తరవాత కథలో భారీ మార్పులు జరిగాయని, దాంతో పార్ట్ 2 అవసరం ఏర్పడిందని అంటున్నారు.
'డ్రాగన్' గ్లింప్స్ చూస్తే, చాలా పాత్రలు కనిపించాయి. కథ పరిధి కూడా పెద్దదే అనే సంగతి అర్థం అవుతోంది. ఇంత స్పాన్ ఉన్న కథని ఒకే భాగంలో చెప్పడం కష్టం. అందుకే పార్ట్ 2 అవసరం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి చిత్రబృందం ఏం చెప్పకపోయినా… ఈ సినిమాకు పార్ట్ 2 తప్పనిసరి అనే కామెంట్స్ చాలా బలంగా వినిపిస్తున్నాయి.
'దేవర' కూడా రెండు భాగాల కథే. 'డ్రాగన్' పూర్తయ్యాక… 'దేవర 2' ఎన్టీఆర్ మొదలెట్టే ఛాన్స్ వుంది. ఆ తరవాత 'డ్రాగన్ 2' ముందుకు వెళ్లొచ్చు.

