Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ మంత్ర. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్

ఏపీ మంత్ర. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్

Telugu 360 1 hr ago

దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు ఇప్పటికీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఒకడుగు ముందుకేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే సరికొత్త నినాదంతో పారిశ్రామిక రంగంలో ఆసక్తికరంగా సృష్టిస్తోంది.

పెట్టుబడిదారులను ఆకర్షించడమే కాకుండా, వారికి ఎలాంటి జాప్యం లేకుండా అనుమతులు ఇవ్వడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం తనదైన మార్క్ చూపిస్తోంది.కేవలం కాగితాలపై ఎంవోయూలు కుదుర్చుకుని చేతులు దులుపుకునే పాత పద్ధతులకు స్వస్తి పలికి, వచ్చిన ప్రతి ప్రతిపాదనను అత్యంత వేగంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేలా పరిపాలనా యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది.

ఏకంగా జీవోల జారీతో దూకుడు

ఈ వేగానికి నిదర్శనంగా, విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు వేళ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. నిన్న ఒక్కరోజే ఐదు కీలక ప్రాజెక్టులకు సంబంధించి నేరుగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావడం పారిశ్రామిక వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపిన వెంటనే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా భూకేటాయింపులు, ప్రోత్సాహకాలపై జీవోలు విడుదల చేయడం ద్వారా తాము చేతల ప్రభుత్వమని నిరూపించుకుంది. ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన 714 పెట్టుబడి ప్రతిపాదనల్లో దాదాపు 74 శాతం అంటే 526 ప్రాజెక్టులను సుమారు రూ. 17.2 లక్షల కోట్ల విలువైనవి వివిధ దశల్లో కార్యరూపంలోకి తీసుకురావడం ఈ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది.

రియల్ టైమ్ ప్రోత్సాహకాలు

కేవలం మాటలతోనే కాకుండా, పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆంధ్రాప్రదేశ్ ఓమ్నిబస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చట్టం-2026 ను అమల్లోకి తెచ్చింది. దీని ద్వారా అనవసరమైన నిబంధనలను రద్దు చేయడమే కాకుండా, నిర్ణీత గడువులోగా అనుమతులు రాకపోతే ఆటో-అపీల్ అయ్యే విధానాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాకుండా, పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీల కోసం పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా, ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతా ద్వారా ఆన్‌లైన్‌లో రియల్ టైమ్ బదిలీ చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. త్వరలోనే ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా తీసుకురాబోతున్నారు.

పెట్టుబడుల స్వర్గధామంగా నవ్యాంధ్ర

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తోడైతే ఫలితాలు ఎలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశానికి చూపిస్తోంది. గూగుల్ ఏఐ సెంటర్, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ సిటీ, బిపిసిఎల్,రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలన్నీ ఏపీ వైపు క్యూ కట్టడానికి ఈ వేగవంతమైన నిర్ణయాలే ప్రధాన కారణం. విశాఖ సదస్సు ద్వారా మరో రూ. 11 లక్షల కోట్ల పెట్టుబడులను గ్రౌండింగ్ చేసి, రాబోయే 12-18 నెలల్లోనే లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో సాగుతున్న ఏపీ ప్రస్థానం, భారత పారిశ్రామిక చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360