Dailyhunt
ఎవరు గెలిచినా వైసీపీ బంధువులే..సంబరాలే!

ఎవరు గెలిచినా వైసీపీ బంధువులే..సంబరాలే!

Telugu 360 1 week ago

మిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభంజనం సృష్టించగానే, సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.

అసలు విజయ్‌కి, జగన్‌కు మధ్య ఉన్న లంకె ఏమిటని ఆరా తీస్తే.. ఏదో ఒక సభలో ఎవరో ఒక అభిమాని జగన్ ఫోటో ఇస్తే విజయ్ దాన్ని పట్టుకున్నారనే ఒక్క చిన్న పాయింట్‌ను పట్టుకుని సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. చూశారా.. మా నాయకుడి క్రేజ్ అంటూ మొదలైన ఈ అతి విచిత్రమైన సంబరాలు చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. గెలిచింది తమిళ తంబి అయితే, పండగ చేసుకుంటున్నది మాత్రం పులివెందుల తమ్ముళ్లు అవ్వడం ఇక్కడ అసలైన ట్విస్ట్.

వైసీపీ నేతల సెలబ్రేషన్ సైకాలజీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అక్కడ ఎవరు గెలిచినా దానికి జగన్ గ్లామర్ అద్దేందుకు ముందే ప్లాన్ రెడీగా ఉంటుంది. ఒకవేళ స్టాలిన్ గెలిస్తే.. స్టాలిన్-జగన్ పాత ఫోటోలు బయటకు తీసి దటీజ్ జగన్ ఫ్రెండ్ షిప్ అనేవారు. పళనిస్వామి గెలిస్తే.. ఆయన పక్కన జగన్ కూర్చున్న ఫోటోలను గ్రాఫిక్స్ చేసి మరీ వైరల్ చేసేవారు. మొత్తానికి ఎవరు గెలిచారన్నది పాయింట్ కాదు, ఎవరో ఒకరు గెలిచారు కాబట్టి, వారితో తమ నాయకుడికి ఎప్పుడో ఒకప్పుడు కంటి చూపు కలిసింది అన్నట్లుగా బిల్డప్ ఇవ్వడమే వీరి ప్రధాన అజెండాగా కనిపిస్తోంది.

అన్నింటికంటే కామెడీ ఏమిటంటే.. స్టాలిన్ కు జగన్ కి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ, ఇప్పుడు అక్కడ స్టాలిన్ ఓడిపోయి విజయ్ దూసుకుపోతుంటే, స్టాలిన్ ఓటమిని కూడా వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఎంజాయ్ చేయడం విడ్డూరంగా ఉంది. విజయ్ స్టైల్ జగన్ లాగే ఉంది , విజయ్ నడక జగన్ నడకలాగే ఉంది అంటూ కొత్త కొత్త పోలికలు కనిపెట్టేస్తున్నారు. పోరుగు రాష్ట్రంలో ఎవరో కష్టపడి గెలిస్తే, ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి పడే ఈ తాపత్రయం చూస్తుంటే, వైసీపీకి ఇప్పుడు కావాల్సింది గెలుపు కాదు.. గెలవకపోయినా ఏదో ఒక గెలుపును తమకు అంటగట్టుకునే గమ్మత్తైన లాజిక్ మాత్రమే అనిపిస్తోంది.

వైసీపీ తీరు చూస్తుంటే, రాబోయే కాలంలో అమెరికా ప్రెసిడెంట్ ఎవరైనా సరే.. ఆయన ఎప్పుడో ఒకసారి వైట్ హౌస్‌లో జగన్ ఫోటో వైపు చూశాడన్న బిల్డప్ తో అక్కడ కూడా సంబరాలు చేసేలా ఉన్నారు. రాజకీయాల్లో మిత్రత్వం, సిద్ధాంతాల కంటే కూడా ఇలాంటి చిత్ర విచిత్రమైన కనెక్షన్లతో కాలక్షేపం చేయడంలో వైసీపీ తర్వాతే ఎవరైనా! గెలిచింది విజయ్ అయితే.. ఆ కిక్కు మాత్రం వైసీపీకి ఎక్కడం అనేది కేవలం ఆ పార్టీకి మాత్రమే సాధ్యమైన అద్భుతమైన రాజకీయ కళ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360