Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గవర్నర్‌గా కిరణ్ కుమార్ రెడ్డి ?

గవర్నర్‌గా కిరణ్ కుమార్ రెడ్డి ?

Telugu 360 2 weeks ago

కేంద్రంలో ప్రతిపాదిత మంత్రివర్గ విస్తరణ, సంస్థాగత మార్పులతో పలు రాష్ట్రాల గవర్నర్ పదవుల భర్తీ ప్రక్రియ కూడా ఊపందుకోనుందనే ప్రచారం జరుగుతోంది.

కేంద్ర మంత్రివర్గంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న బీజేపీ నేతలకు అదనపు అవకాశాలు లేకపోగా, ఉన్న స్థానాల్లోనూ సమన్వయ మార్పులు జరిగే అవకాశం ఉంది. క్రమంలోనే, ఏపీకి చెందిన సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు గవర్నర్ల జాబితాలో ప్రముఖంగా వినపడుతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్‌ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత క్రియాశీల రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో పదవులు దక్కించుకోలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాజంపేట స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమిని చవిచూశారు. రాజ్యాంగపరమైన , పరిపాలనాపరమైన అంశాలపై సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వాలనే యోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్లు సమాచారం.

మాజీ ముఖ్యమంత్రులు, సీనియర్ పార్లమెంటేరియన్లను వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా పంపడం బీజేపీ సాంప్రదాయ వ్యూహాలలో ఒకటి. కిరణ్ కుమార్ రెడ్డికి సీఎంగా పనిచేసిన అపారమైన పరిపాలనా అనుభవం ఉండటం, శాసనసభా వ్యవహారాలపై పట్టు ఉండటం ఆయనకు సానుకూల అంశాలుగా మారాయి. ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోయినా, ఆయనకున్న రాజ్యాంగ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఏదైనా కీలకమైన రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360