Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గొడ్డలి పార్టీ అంటే చాలు కనెక్టయిపోతున్నారు!

గొడ్డలి పార్టీ అంటే చాలు కనెక్టయిపోతున్నారు!

Telugu 360 4 months ago

రాజకీయాల్లో ఒక పార్టీకి పాజిటివ్ ఇమేజ్ రావడం ఎంత కష్టమో, ఒక నెగెటివ్ ముద్ర పడటం అంత సులభం. వైసీపీ విషయంలో ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతోంది. ఐదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన కొన్ని సంచలన ఘటనలు, ముఖ్యంగా వివేకా హత్య కేసులో వినిపించిన గొడ్డలి పోటు అనే పదం ఇప్పుడు ఆ పార్టీకి శాశ్వత ఇంటిపేరుగా మారిపోయేలా కనిపిస్తోంది.

కూటమి నేతలు గొడ్డలి పార్టీ అని విమర్శిస్తుంటే, ఆ పేరును ప్రజలు కూడా ఈజీగా కనెక్ట్ అయిపోతుండటం వైసీపీ నేతలకు మింగుడుపడటం లేదు.

గింజుకుంటున్న నేతలు

తమ పార్టీని గొడ్డలి పార్టీ అంటున్నారని వైసీపీ నేతలు ప్రతిరోజూ ప్రెస్‌మీట్లు పెట్టి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడే అసలు కామెడీ మొదలవుతోంది. మమ్మల్ని గొడ్డలి పార్టీ అనకండి అని వారు ఎంత గట్టిగా అరుస్తుంటే, ఆ పదం అంతలా హైలైట్ అవుతోంది. ప్రత్యర్థుల విమర్శలకు కౌంటర్ ఇవ్వబోయి, వీరు కూడా అదే పదాన్ని పదే పదే ఉచ్చరించడం వల్ల.. తెలియకుండానే ఆ బ్రాండింగ్‌ను వీరు మరింత ప్రమోట్ చేస్తున్నారనే సెటైర్లు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఒక విమర్శను లైట్ తీసుకోకపోతే, అది ఎలా ముదిరి పాకాన పడుతుందో వైసీపీ నేతల తీరు చూస్తుంటే అర్థమవుతోంది.

ప్రజల నోళ్లలో నానిపోతే కష్టమే

వైసీపీ అంటే వైఎస్సార్ కాంగ్రెస్ అనే పూర్తి పేరును మర్చిపోయి, కేవలం గొడ్డలి పార్టీ అంటే చాలు చిన్న పిల్లవాడు కూడా గుర్తుపట్టే పరిస్థితి వస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, రీల్స్ ఈ పేరును క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాయి. కొన్ని పార్టీలకు సైకిల్ పార్టీ , చేయి పార్టీ అని గుర్తులు ఎలా స్థిరపడిపోయాయో, ఇప్పుడు వైసీపీకి గొడ్డలి అనేది ఒక అనధికారిక గుర్తుగా మారిపోతోంది. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లు, పదే పదే ఆ గొడ్డలి ప్రస్తావన రావడం వెనుక ఉన్న కారణాలను ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఎదురుదాడి కూడా ఎదురుదెబ్బే

సాధారణంగా ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు పార్టీలు తమ అభివృద్ధి పనులనో, సంక్షేమ పథకాలనో చెప్పుకుని డైవర్ట్ చేయాలి. కానీ వైసీపీ నేతలు మాత్రం మేము గొడ్డలి పార్టీ కాదు, మీరే గొడ్డలి పార్టీ అంటూ చేసే రివర్స్ అటాక్ ఎక్కడా పేలడం లేదు. పైగా ఈ విమర్శను తిప్పికొట్టడం వారికి కత్తి మీద సాములా మారింది. ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో వైసీపీ బోర్డులపై ఫ్యాన్ బదులు గొడ్డలి బొమ్మ వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. గొడ్డలి అనే పదం వినిపిస్తే వైసీపీ నేతలకు బీపీ పెరుగుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360