Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైడ్రాలోనే రంగనాథ్ - హైకోర్టు స్టే !

హైడ్రాలోనే రంగనాథ్ - హైకోర్టు స్టే !

Telugu 360 3 weeks ago

హైదరాబాద్ విపత్తుల స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, రక్షణ సంస్థ కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి రంగనాథ్‌ను తొలగించాలంటూ గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.

ఈ మేరకు సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధిస్తూ న్యాయస్థానం కీలక నిర్ణయం వెలువరించింది.

హైడ్రా కమిషనర్ నియామకం, బాధ్యతల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన సింగిల్ జడ్జి బెంచ్.. రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వ తరఫున, సంబంధిత వర్గాలు వెంటనే హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించి అప్పీల్ దాఖలు చేశాయి. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులోని అంశాలను పునఃపరిశీలించాలని కోర్టును కోరాయి.

ఈ అప్పీల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ జారీ చేసిన తొలగింపు ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్ తన విధులను యథావిధిగా కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి పూర్తి స్థాయి విచారణను హైకోర్టు నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ దిశగా హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360