Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైప్ పెంచిన చరణ్ పోలిక

హైప్ పెంచిన చరణ్ పోలిక

Telugu 360 6 days ago

'పెద్ది' ట్రైలర్ బయటికి వచ్చింది. సినిమా కథ, క్యారెక్టర్‌కు తగ్గట్టుగానే ట్రైలర్‌ను కట్ చేశాడు బుచ్చిబాబు. పెద్ది జర్నీనే కథలో కీలకం.

ఆ పాత్రపైనే పూర్తిగా ఆర్గానిక్‌గా ఫోకస్ పెట్టాడు దర్శకుడు. తాజాగా ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ స్పీచ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

'రంగస్థలం', 'మగధీర', 'ఆర్ఆర్ఆర్' సినిమాలతో 'పెద్ది'ని పోల్చారు చరణ్. 'పెద్ది' తన కెరీర్‌లో చేసిన మోస్ట్ ఇన్‌స్పైరింగ్ ఫిల్మ్ అని చెప్పారు. "మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు తరచుగా రావు. అలాంటి సినిమాలు రావాలంటే దశాబ్దాలు పడుతుంది. 'పెద్ది' కూడా అలాంటి అరుదైన సినిమా. ఇది నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే సినిమా అవుతుంది" అంటూ ఎంతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు.

అన్నట్టు 'పెద్ది' కోర్ పాయింట్‌ను కూడా రివీల్ చేశారు చరణ్. ఇది ఒక వ్యక్తి తన ఐడెంటిటీ కోసం చేసే పోరాటమట. పెద్ది తన ఐడెంటిటీ కోసం ఏం చేశాడనేది దర్శకుడు బుచ్చిబాబు చాలా ఆర్గానిక్‌గా, అదే సమయంలో కమర్షియల్‌గా చూపించారని చెప్పారు. ట్రైలర్‌లో కూడా ఆ ఛాయలు స్పష్టంగా కనిపించాయి.

మొత్తానికి 'మగధీర', 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్' లాంటి ఇండస్ట్రీ హిట్స్‌తో పోల్చి 'పెద్ది'పై అంచనాలను మరింతగా పెంచారు చరణ్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360