Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హెల్మెట్ పెట్టుకోండి.. మోహన్ బాబుపై సెటైర్‌

హెల్మెట్ పెట్టుకోండి.. మోహన్ బాబుపై సెటైర్‌

Telugu 360 5 days ago

మంచు ఫ్యామిలీ అంతా ఒక వైపు, మనోజ్‌.. లక్ష్మిలు మరో వైపు. ఈ ఇంటి గొడవలు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఓ దశలో… మీడియా అంతా మోహన్ బాబు ఇంటి ముందే ఉండేది.

సినిమా స్క్రిప్టుకు మించి ట్విస్టులు, యాక్షన్ సినిమాకు మించిన గొడవలూ.. ఈ కుటుంబంలో కనిపించాయి. ఇప్పుడు ఆ గొడవలు సర్దుమణిగాయి కానీ, లోలోపల ఇంకా గ్యాప్ ఉంది. మనోజ్ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఈ వ్యవహారంపై ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు జర్నలిస్టులు. ఈసారీ అదే జరిగింది.

రేపు మనోజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. 'మీ నాన్నగారితో గొడవలు సర్దుమణిగినట్టేనా' అని అడిగితే… `అది ఎవర్ని అడగాలో మీకు తెలుసు. ఆయన్నే అడగండి. వెళ్లేటప్పుడు మైకు తీసుకెళ్లొద్దు. తీసుకెళ్లినా హెల్మెట్ తప్పనిసరి..' అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

ఆ గొడవల్లో ఓ జర్నలిస్టుమీద మోహన్ బాబు మైకు విసిరేయడం, ఆ తరవాత పెద్ద రాద్ధాంతం జరగడం, జర్నలిస్టుకి మోహన్ బాబు క్షమాపణలు చెప్పడం… ఈ ఎపిసోడ్ గుర్తుండే ఉంటుంది. దానిపైనే మనోజ్ వేసిన సెటైర్ ఇది. "తన తండ్రి ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని.. ఇప్పుడూ ఉన్నాయని" ఈ సందర్భంగా మనోజ్ పేర్కొనడం కొసమెరుపు. 'కన్నప్ప' రిలీజ్ సమయంలో కూడా.. మనోజ్ సినిమా చూసి పాజిటీవ్ రివ్యూ ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. మనోజ్‌కి ఫ్యామిలీ ఎటాచ్‌మెంట్ ఎక్కువ. అందరితోనూ కలిసి ఉండాలనుకొంటుంటారు. కానీ పరిస్థితులే అందుకు అనుకూలించడం లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360