Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇల్లు కొనాలనుకునేవారికి ఇదే సరైన టైం !

ఇల్లు కొనాలనుకునేవారికి ఇదే సరైన టైం !

Telugu 360 6 days ago

హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్ గత కొన్ని ఏళ్లుగా ఊహించని రీతిలో దూసుకుపోయింది. దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మెట్రో నగరంగా నిలిచిన భాగ్యనగరంలో..

ప్రస్తుతం మార్కెట్ స్వల్పంగా స్థిరపడింది. నిరంతరం పెరుగుతూ వచ్చిన ధరలు ఇప్పుడు ఒకే చోట నిలకడగా ఉండటం , తాత్కాలిక మందగమనం వైపు అడుగులు వేయడం కనిపిస్తోంది. అయితే, ఈ తాత్కాలిక ఒడిదుడుకులు అనేవి సొంత ఇల్లు, ఫ్లాట్ కొనాలనుకునే సామాన్య, మధ్యతరగతి రిటైల్ కస్టమర్లకు ఒక అద్భుతమైన అవకాశమని మార్కెట్ నిపుణులు, ఆర్థిక విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

సాధారణంగా మార్కెట్ విపరీతమైన డిమాండ్‌తో ఉన్నప్పుడు బిల్డర్లు , డెవలపర్లు కస్టమర్ల డిమాండ్లకు లొంగరు. ధరలు తగ్గించకపోగా, అదనపు వసతుల విషయంలో రూపాయి కూడా తగ్గడానికి ఇష్టపడరు. కానీ, ప్రస్తుత పరిస్థితులు కొనుగోలుదారునికి అనుకూలంగా మారాయి. మార్కెట్‌లో అమ్మకాలు కాస్త నెమ్మదించిన ఈ తరుణంలో.. బిల్డర్లతో ముఖాముఖి కూర్చుని ధరల విషయంలో, ఉచిత కార్ పార్కింగ్, క్లబ్ హౌస్ మెంబర్‌షిప్ వంటి అదనపు వసతుల విషయంలో గట్టిగా బేరసారాలు ఆడేందుకు కస్టమర్లకు లీడ్ దొరుకుతుంది.

ఇలాంటి ఒడిదుడుకుల సమయంలోనే ప్రముఖ నిర్మాణ సంస్థలు సైతం తమ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి, నగదు లభ్యత కోసం వినూత్నమైన ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. నో-ఈఎంఐ ఆఫర్లు, ఈజీ ఇన్‌స్టాల్‌మెంట్ స్కీమ్‌లతో పాటు ధరలలో కొంతమేర రాయితీలు ఇవ్వడానికి కూడా బిల్డర్లు వెనకాడరు. రేపు మార్కెట్ మళ్లీ పుంజుకుని, ధరలు ఆకాశాన్ని తాకినప్పుడు కొనుగోలు చేయడం కంటే.. ఇప్పుడు లభిస్తున్న ఈ సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని డీల్ క్లోజ్ చేసుకోవడం ఆర్థికంగా ఎంతో లాభదాయకమని నిపుణులు సూచిస్తున్నారు.

హైదరాబాద్ ఐటీ కారిడార్ విస్తరణ, మెట్రో రెండో దశ విస్తరణ పనులు, శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల అభివృద్ధి వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులు నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ తాత్కాలిక మందగమనం చాలా కాలం కొనసాగే అవకాశం లేదు. రాబోయే రోజుల్లో ధరలు మళ్లీ పెరగడం ఖాయం. సొంత గూడు సమకూర్చుకోవాలనుకునే వారికి రిగ్గా ఇప్పుడే సరైన సమయమని, ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360