Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IPLలో తాడో పేడో: GTvsRR

IPLలో తాడో పేడో: GTvsRR

Telugu 360 2 weeks ago

పీఎల్ లో మరో కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. ఈరోజు జరిగే ఎలిమినేటర్ లో గుజరాత్ టైటాన్స్‌, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు… ఆదివారం జరిగే ఫైనల్ లో బెంగళూరుని ఢీ కొడుతుంది.

ఓరకంగా ఇది సెమీ ఫైనల్ అనుకోవొచ్చు.

పేపర్ మీద గుజరాత్ టైటాన్స్‌, రాజస్థాన్ రాయల్స్ బలాబలాలు బేరీజు వేస్తే.. రెండు జట్లూ సమతూకంలోనే ఉన్నాయి. ఈ సీజన్‌లో రాజస్థాన్ తో పోలిస్తే గుజరాత్ మెరుగ్గా రాణించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండేది. రాజస్థాన్ చివరి వరకూ డక్కా ముక్కీలు తింటూ, ప్లే ఆఫ్ చేరుకొంది. అయితే.. రాజస్థాన్ లో మ్యాచ్ విన్నర్లకు కొదవ లేదు. మరీ ముఖ్యంగా సూర్యవంశీ చెలరేగి ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో కూడా కళ్లన్నీ ఈ కుర్రాడిపైనే ఉండడం ఖాయం. సూర్యవంశీ ఆట తీరే… ఈ మ్యాచ్ విజేతను నిర్ణయిస్తుందనడంలో సందేహం లేదు. సూర్యవంశీ వికెట్ త్వరగా తీయగలిగితే… గుజరాత్ పట్టుసాధించే అవకాశం ఉంది. అయితే జైస్వాల్, పరాగ్‌, జురేల్, ఫెరీరా… వీళ్లు కూడా మంచి ఫామ్ లోనే ఉన్నారు. జైస్వాల్ అయితే.. పవర్ ప్లేలో సూర్యవంశీతో ధీటుగా ఆడుతున్నాడు. ఒక్కోసారి తాను తగ్గి సూర్యవంశీకి స్ట్రయిక్ ఇస్తున్నాడు. అందుకే తొలి వికెట్ కి ఇద్దరూ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నారు. బౌలింగ్ విషయానికొస్తే ఆర్చర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ముంబై, హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో కీలకమైన వికెట్లు తీసి, ప్రత్యర్థి వెన్నుముక విరిచాడు. బ్యాటింగ్ లోనూ విలువైన పరుగులు జోడిస్తున్నాడు. ఆర్చర్ కి బ్రిజేష్ శర్మ, బర్గర్ సహకారం అందిస్తున్నారు.

గుజరాత్ ఎక్కువగా టాప్ ఆర్డర్ పై ఆధారపడుతోంది. సుదర్శన్‌, గిల్, బట్లర్‌… ఈ ముగ్గురూ చెలరేగుతున్నారు. ముఖ్యంగా సుదర్శన్‌, గిల్ జంట గుజరాత్ కు మంచి ఆరంభాలను ఇస్తోంది. వీరిద్దరూ బాగా ఆడిన మ్యాచ్‌లన్నీ… గుజరాత్ గెలుచుకొంది. అయితే ఈ ముగ్గురి తరవాత ఆధారపడదగ్గ బ్యాటర్ లేడు. వాష్టింటన్ సుందర్ బ్యాటింగ్ లో రాణిస్తున్నా మిగిలిన వాళ్లు కీలకమైన దశలో చేతులెత్తేస్తున్నారు. ఇది ఎలిమినేటర్ కాబట్టి.. ప్రతి ఒక్కరూ తమ పాత్ర సమర్థంగా నిర్వహించాల్సిందే. ఇక బౌలింగ్ లో గుజరాత్ కు తిరుగులేదు. ఈ ఐపీఎల్ లో అత్యంత బలమైన బౌలింగ్ దళం సొంతం చేసుకొంది. ముఖ్యంగా సిరాజ్‌, రబాడ, రషిద్ త్రయం.. వికెట్ల వేటలో ముందుంది. ఈ ముగ్గురూ రాణిస్తే గుజరాత్ విజయం నల్లేరుపై నడకే.

పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంది. తొలుత బ్యాటింగ్ చేస్తే 200పైనే పరుగులు సాధించే అవకాశం ఉంది. అయితే టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ కి మొగ్గు చూపించొచ్చు. ఈ పిచ్ పై ఆర్‌.ఆర్ ది తిరుగులేని రికార్డ్‌. ఇక్కడ ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ గెలుపొందింది. సో… ప్రస్తుతానికి ఆర్‌.ఆర్ ఫేవరెట్ అనుకోవొచ్చు. ఏదేమైనా ఈ రోజు.. మరో ఆసక్తికరమైన పోరు జరగడడం ఖాయం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360