Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ "మెలోడి"

ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ "మెలోడి"

Telugu 360 4 days ago

భారత ప్రధాని నరేంద్ర మోదీ , ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య ఉన్న స్నేహపూర్వక బంధం సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్‌గా మారింది. తాజాగా ఇటలీ పర్యటనకు వెళ్లారు.

అక్కడ మోదీని కలిసిన ఇటలీ ప్రధాని.. తన అధికారిక ఖాతాలో మోదీతో కలిసి దిగిన ఒక సెల్ఫీ వీడియోను షేర్ చేసింది. ఓ చాక్లెట్ కవర్ ఇస్తూ.. హలో ఫ్రమ్ ది మెలొడీ టీమ్ అని అని అనడంతో ఇంటర్నెట్ ఒక్కసారిగా షేక్ అయ్యింది. కేవలం కొద్ది నిమిషాల్లోనే ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి గ్లోబల్ ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చింది.

ఈ మెలొడీ కథ చాలా పెద్దదే. ఇది మెలోని పేరులోని మొదటి సగం , మోడీ పేరులోని చివరి సగం కలిపి నెటిజన్లు సృష్టించిన పేరు. గతంలో దుబాయ్‌లో జరిగిన COP28 సదస్సులో వీరిద్దరూ కలిసి దిగిన సెల్ఫీని మెలోని స్వయంగా Melodi అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేయడంతో ఈ క్రేజ్ మొదలైంది. అప్పటి నుంచి వీరిద్దరూ ఏ అంతర్జాతీయ వేదికపై కలిసినా, ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడం పరిపాటిగా మారింది.

ఇటలీ వేదికగా జరిగిన G7 సదస్సు, గత 2026 మే నెలలో రోమ్‌లో జరిగిన ద్వైపాక్షిక భేటీ సందర్భంగా వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ మరియు పరస్పర గౌరవం అందరినీ ఆకట్టుకుంది. మెలోని వీడియోలో మోదీ నవ్వుతూ అభివాదం చేయడం, ఆ తర్వాత ఆమె టీమ్ మెలొడీ అని సంబోధించడం చూస్తుంటే.. ఇరువురు నేతలు కూడా సోషల్ మీడియాలో తమపై వస్తున్న మీమ్స్ , ట్రెండ్స్ గురించి అవగాహనతో ఉన్నారని, దానిని సానుకూలంగా ఆస్వాదిస్తున్నారని అర్థమవుతోంది.

రాజకీయంగా చూస్తే, భారత్ , ఇటలీ మధ్య రక్షణ, ఇంధనం మరియు సాంకేతిక రంగాలలో వ్యూహాత్మక సంబంధాలు బలపడుతున్నాయి. అయితే, దౌత్యపరమైన చర్చల కంటే కూడా ఈ మెలొడీ మ్యాజిక్ ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. ఇది కేవలం ఇద్దరు దేశాధినేతల మధ్య ఉన్న స్నేహమే కాకుండా, ఆధునిక కాలంలో డిజిటల్ డిప్లొమసీ ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో చెప్పడానికి ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360