తెలుగులో జాన్వీ కపూర్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా? అని ఫ్యాన్స్ చాలా ఆశగా ఎదురు చూశారు. 'దేవర' తో తాను కోరుకొన్న ఎంట్రీ దొరికింది కూడా.
ఎన్టీఆర్ వారసుడు జూ.ఎన్టీఆర్‌తో శ్రీదేవి వారసురాలు జాన్వీ కలిసి నటించడం అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్. అయితే 'దేవర' రిజల్ట్ పట్ల జాన్వీ కానీ, జాన్వీ అభిమానులు కానీ అంత సంతృప్తిగా కనిపించలేదు. ఎందుకంటే `దేవర`లో జాన్వీ పాత్ర చాలా పరిమితం. తాను పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యే ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు అది 'పెద్ది' తో దొరికింది. చిరంజీవి - శ్రీదేవిలది కూడా హిట్ కాంబోనే. వీరిద్దరి లెగస్సీని అందిపుచ్చుకొన్న చరణ్, జాన్వీలను జంటగా చూడాలని ఫ్యాన్స్ చాలా గట్టిగా కోరుకొన్నారు. అది 'పెద్ది' తో తీరబోతోంది. అయితే.. ఈ సినిమాలో జాన్వీ పాత్ర ఎలా ఉండబోతోంది? ఈసారైనా తాను తన అభిమానుల్ని సంతృప్తి పరచగలదా అనేదే పెద్ద ప్రశ్న.
'పెద్ది' ట్రైలర్‌లో అన్నీ బాగున్నాయి కానీ, జాన్వీ ఎంట్రీ, తన డైలాగులు పంటి కింద రాయిలా తగిలాయి. తన పాత్రని పూర్తిగా మాస్ ని టార్గెట్ చేయడానికే తీర్చిదిద్దినట్టు అర్థం అవుతోంది. సినిమాకు అది ప్లస్ కావొచ్చు కానీ జాన్వీ కెరీర్‌కి మాత్రం ఉపయోగపడదు.
పైగా ఈ సినిమాలో చరణ్ పక్కన డాన్సులు చేయడం, ఆ విభాగంలో మార్కులు సంపాదించడం అంత ఈజీ కాదు. `పెద్ది`లో ఐటెమ్ సాంగ్ పై అందరి దృష్టీ పడింది. ఈ పాటలో శ్రుతి హాసన్ తో పాటుగా జాన్వీ కూడా స్టెప్పులు వేయబోతోంది. డాన్స్ విషయంలో చరణ్‌ని బీట్ చేయడం చాలా కష్టం. కనీసం శ్రుతిని దాటాలన్నా జాన్వీ చాలా కష్టపడాల్సిందే. ఇది జాన్వీకి మరో పరీక్ష.
కానీ చరణ్ మాత్రం జాన్వీ డాన్సులు అదిరిపోతాయని. సెట్లో తనకంటే జాన్వీనే ఎక్కువ కష్టపడిందని చెప్పుకొస్తున్నాడు. మాస్‌ని అలరించాలంటే.. డాన్సుల్లో కూడా అదరగొట్టాల్సిందే. మరి ఇంత టఫ్ ఫైట్ లో జాన్వీ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

