వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ ద్వారా తనలోని అపారమైన మంచితనాన్ని మరోసారి లోకానికి చాటిచెప్పారు.
ఆయన మైక్ పట్టుకుని తన నైతికత, మంచితనం గురించి క్లాస్ పీకుతుంటే.. వింటున్న జనం మాత్రం ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి ఫ్యాక్షన్ చరిత్ర నుంచి ఫ్యామిలీ పంచాయితీల వరకు ఒక్కొక్కటిగా నెమరువేసుకుంటున్నారు. రాజారెడ్డి కాలం నాటి ముఠా రాజకీయాల నుంచి పరిటాల రవి హత్యోదంతం వరకు, అలాగే సొంత చెల్లి, తల్లితో నడుస్తున్న ఆస్తుల వివాదాల వరకు.. జగన్ రెడ్డి గారు చేసిన మంచిని ప్రజలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటున్నారు.
ప్రెస్ మీట్‌లో జగన్ గారు సుద్దులు చెబుతుంటే.. రాయలసీమ ఫ్యాక్షన్ చరిత్ర తెలిసిన వారు ఆయన మంచి తనాన్ని కథలు కథలుగా చెప్పడం ప్రారంభించారు. ఒకప్పుడు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన చరిత్రను, పరిటాల రవి వంటి బలమైన నేతల హత్యల వెనుక సాగిన రాజకీయ వ్యూహాలను ఇరుపక్షాల నేతలు ఇప్పుడు మళ్లీ గుర్తుచేస్తున్నారు. "నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, నా అంత మంచివాడు లేడు అని జగన్ రెడ్డి గారు సెలవిస్తుంటే.. అవును నిజమే.. ఎంత మంచివాడైతే ప్రత్యర్థులను అంత చక్కగా పక్కకు తప్పుకునేలా చేస్తారు అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.
ఇక సొంత కుటుంబ సభ్యుల విషయంలో ఆయన చూపించిన మంచితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కన్నతల్లి విజయమ్మ, తోడబుట్టిన చెల్లెలు షర్మిలమ్మలను ఆస్తుల కోసం కోర్టుల చుట్టూ తిప్పడం, ప్రెస్ మీట్లు పెట్టి మరీ వారిపై విమర్శలు చేయించడం ద్వారా జగన్ రెడ్డి గారు తన కుటుంబ బంధాల విలువను నిరూపించారు. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో గొడ్డలి పోటు ను గుండెపోటు గా మార్చడానికి జరిగిన ప్రయత్నాలను కూడా ప్రజలు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. ఇంతటి ఉదాత్తమైన మంచితనం ఉన్న నాయకుడిని చూసి సొంత ఫ్యామిలీ మెంబర్లే తలపట్టుకుంటే.. సామాన్య ప్రజలు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు.
జగన్ రెడ్డి గారు పెట్టిన ఈ ఒక్క ప్రెస్ మీట్.. జనాల మతిమరుపును పోగొట్టే ఒక అద్భుతమైన మెమరీ టాబ్లెట్ లా పనిచేసింది. ఆయన తనను తాను సమర్థించుకోవాలని చూస్తే.. అది కాస్తా రివర్స్ అయి ఆయన రాజకీయ ప్రస్థానంలోని డార్క్ చాప్టర్లన్నింటినీ జనం ముందు పరిచేలా చేసింది. జగన్ రెడ్డి సెల్ఫ్ డబ్బా.. జనాలకు పాత గాయాలను గుర్తేసే రిమైండర్ గా మారిందన్నమాట!

