ఎవరైనా రాజకీయ నాయకుడు ప్రెస్మీట్ ఎందుకు పెడతారు?. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి పెడతారు. కానీ జగన్ రెడ్డి మాత్రం తన ఫ్రస్ట్రేషన్‌ను తీర్చుకోవడానికి పెడతారు.
చంద్రబాబు వయసు గుర్తు చేసుకుని ఆయన ఎంతో కాలం రాజకీయాలు చేయలేరని చెప్పుకుని తనకు తాను ధైర్యం చెప్పుకుంటారు. చంద్రబాబుకు గుండెపోటు వస్తే బాగుండని తన మనసులో మాట చెప్పుకుంటారు. తాము చేసిన నేరాలు, ఘోరాలన్నింటినీ తాము చేయలేదని.. తనకు మాత్రమే సాధ్యమైన క్రిమినాలజీతో వాదిస్తూంటారు. ప్రెస్మీట్లలో అంతకు మించిన విషయం ఉండదు. గురువారం కూడా ఆయన అదే చేశారు.
మావిగన్ పేరు వింటే చంద్రబాబుకు గుండెపోటు వస్తుందట.. నిజానికి ఈ పేరుతో ట్రోల్ అయింది.. పరువు పోగొట్టుకుంది జగన్ రెడ్డి, వైసీపీనే. టీడీపీ నేతలే కాదు వైసీపీ నేతలూ నవ్వుకుంటున్నారు. ఇక అమరావతిపై అప్పట్లానే ఆయన తప్పుడు ఆరోపణలతో విషం చిమ్మే ప్రయత్నం చేశారు. కానీ ఆయన గురించి .. ఆయన చేసే ఆరోపణల గురించి అన్నీ ఇంతకు ముందే అందరికీ తెలిసినవే. సాక్షిలో చేసే పిచ్చి పిచ్చి ఆరోపణల్ని తీసుకొచ్చి ఆయన చదువుతారు.
ఇక వైసీపీ నేతల నేరాలు పెద్ద దస్తగిరి హత్య .. జోగి రమేష్ నకిలీ మద్యం దందాలన్నీ బయటపడితే.. అవన్నీ టీడీపీ వాళ్లు చేసినవని చెబుతున్నారు. పెద్దదస్తగిరి అనే వైసీపీ కార్యకర్తను బినామీగా పెట్టి వంద కోట్ల ఆస్తులు సంపాదించిన వారే .. ఆయనను హత్య చేసినట్లుగా పోలీసులు చెబితే జాతరలో జరిగిన గొడవ వల్ల హత్య జరిగిందని ఆయన భార్యతో వైసీపీ నేతలు చెప్పించి.. అదే నిజమని ఆయన నమ్మించే ప్రయత్నం చేశారు. ఇలా అన్నీ నేరాలు అంతే. చివరికి వైఎస్ చనిపోవడంపైనా ఇంకా అనుమానాలున్నాయట. వివేకా హత్య టీడీపీ హయాంలో జరిగింది కాబట్టి చంద్రబాబే చేయించారు. తాను మంచి వాడని కాబట్టే రాజారెడ్డి హత్య కేసులో ఉన్న సతీష్ రెడ్డిని తన పార్టీలో చేర్చుకున్నట్లుగా ఆయన చెబుతున్నారు.
జగన్ రెడ్డి ప్రెస్మీట్లు చూసిన వైసీపీ నేతల కూ.. బహుశా ఇదే రాజకీయం ఏమో అని అనుకుని సంతృప్తి పడాల్సిందేమో. తనకు కోపం వచ్చినప్పుడల్లా నెలకో ప్రెస్మీట్ పెట్టి.. చంద్రబాబు కు గుండెపోటు రావాలని కోరుకోవడం, ఆయన వయసు గుర్తు చేసుకుని సంతృప్తి పడటం.. తాను గొప్ప విలువలున్న వ్యక్తినని చెప్పుకోవడం.. ఇంతకు మించి ఆయనకు తెలిసిన రాజకీయం ఇంకేమీ లేదనుకోవచ్చు.

