Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనసేనానికి డబుల్ క్లారిటీ !

జనసేనానికి డబుల్ క్లారిటీ !

Telugu 360 1 week ago

నసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు పక్కా పొలిటికల్ క్లారిటీ తో కనిపిస్తున్నారు. గతంలో తనపై పడ్డ భావోద్వేగ నేత అనే ముద్రను చెరిపేస్తూ, ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ముఖ్యంగా ప్రత్యర్థులు తనను ఒక కులానికి పరిమితం చేయాలని చూస్తున్న కుట్రలను ఆయన గమనించారు. మంగళగిరి సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. తనను ఒక వర్గానికి కట్టేయాలని చూసే వారెవరో, తన ఎదుగుదల చూసి ఓర్వలేక రెచ్చగొట్టేవారెవరో ఆయనకు బాగా తెలుసని స్పష్టమవుతోంది.

కుల ముద్రకు చెక్

పవన్ కళ్యాణ్ తనను తాను ఒక కుల నేతగా ఎప్పుడూ చెప్పుకోలేదు, కానీ ప్రత్యర్థులు మాత్రం ఆయన్ను ఆ చట్రంలోనే ఉంచాలని ప్రయత్నిస్తున్నారు. తాను ఒక కులంలో పుట్టినప్పటికీ, తన ఆలోచనలు మాత్రం అన్ని వర్గాల శ్రేయస్సు కోసమే ఉంటాయని తేల్చి చెప్పారు. కాపుల కోసం ఏం చేశావని అడిగే వైసీపీ నేతలకు సమాధానంగా.. తాను కేవలం ఒక వర్గం కోసమే కాకుండా, మొత్తం దేశం కోసం, వ్యవస్థ కోసం పని చేయడానికి వచ్చానని పవన్ స్పష్టం చేశారు. తద్వారా తనపై కాపు ముద్ర వేయాలన్న విపక్షాల ఎత్తుగడలను ఆయన చిత్తు చేశారు.

కార్యకర్తలకు దిశానిర్దేశం

ఈ మధ్య కాలంలో కొంత టీవీల్లో గొంతు చించుకుంటూ, వంగవీటి రంగా పేరు వాడుకుంటూ రాజకీయం చేసే వారిపై పవన్ విరుచుకుపడ్డారు. రంగా ఆపదలో ఉన్నప్పుడు రక్షించుకోలేని వారు, నేడు చనిపోయిన తర్వాత ఆయన పేరుతో కథలు చెప్పడం హాస్యాస్పదమని ఆయన వాళ్ల గాలి తీసేసారు. ఇతరుల ట్రాప్‌లో పడి మనం కూడా అలాగే అరవాల్సిన అవసరం లేదని, మన సిద్ధాంతాలతోనే వారికి గట్టిగా సమాధానం చెప్పాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యర్థులు ఎక్కడైతే తనను బలహీనపరచాలని చూస్తున్నారో, అదే పాయింట్‌ను పవన్ తన బలంగా మార్చుకుంటున్నారు.

విజయ్ పార్టీని చూపించి రెచ్చగొట్టే వాళ్లకు గట్టి షాక్

తమిళ నటుడు విజయ్ పార్టీ పై కూడా పవన్ ఆసక్తికరంగా స్పందించారు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లుగా కొందరి తీరు ఉందని ఎద్దేవా చేశారు. అక్కడి పరిస్థితులు, ఇక్కడ పరిస్థితులు వేరని.. తాను ఒంటరిగా పోటీ చేసిన విషయాన్నీ గుర్తు చేశారు. రాజకీయాల్లో అనుభవం పవన్‌ను మరింత రాటుదేలేలా చేసింది. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ, విమర్శలకు కుంగిపోకుండా, తన బలాన్ని నిశ్శబ్దంగా పెంచుకుంటున్నారు. కులం, ప్రాంతం అనే అడ్డుగోడలను దాటి అందరివాడు అనిపించుకోవాలనే పవన్ ప్రయత్నం. జనసేనకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రత్యర్థుల ఉచ్చులో పడకుండా తనదైన శైలిలో స్టాండ్ తీసుకోవడం పవన్ కళ్యాణ్ మారుతున్న రాజకీయ శైలికి నిదర్శనం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360