Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జయలలిత వారసుడు విజయ్ !

జయలలిత వారసుడు విజయ్ !

Telugu 360 5 days ago

మిళనాడు రాజకీయాల్లో టీవీకే అధినేత విజయ్ తన అడుగులను అత్యంత వ్యూహాత్మకంగా వేస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలిత వదిలివెళ్లిన భారీ ఓటు బ్యాంకును హస్తగతం చేసుకునేందుకు విజయ్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

అన్నాడీఎంకే చీలికలు, బలహీనమైన నాయకత్వంతో సతమతమవుతున్న తరుణంలో, ఆ పార్టీ క్యాడర్‌ను తన వైపు తిప్పుకోవడం విజయ్‌కు సులభంగా మారింది. అందుకే ఆయన మొదటి నుంచి అన్నాడీఎంకేపై ఎక్కడా పల్లెత్తు మాట అనడం లేదు. పైగా, ఆ పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలను, నేతలను సాదరంగా ఆహ్వానిస్తూ.. అమ్మ ఆశయాలను తానే నెరవేరుస్తానని సంకేతాలు ఇస్తున్నారు.

అమ్మ క్యాంటీన్లే అస్త్రంగా..

జయలలిత ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్లు తమిళనాడులో పేదలకు ఎంతో చేరువయ్యాయి. అయితే డీఎంకే హయాంలో అవి నిరాదరణకు గురయ్యాయనే విమర్శ ఉంది. ఇప్పుడు విజయ్ ఆ పాయింట్‌ను సరిగ్గా వాడుకుంటున్నారు. అధికారంలోకి రాగానే అమ్మ క్యాంటీన్లను మరింత అధునాతనంగా తీర్చిదిద్ది, ప్రజలందరికీ తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించే దిశగా ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఆదేశాలు ఇవ్వడం ద్వారా అన్నాడీఎంకే విధేయులైన ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మాటలతో కాకుండా చేతలతో జయలలిత వారసుడు అనిపించుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.

డీఎంకే వ్యతిరేక ఓటుపై కన్నేసిన విజయ్

తమిళనాడులో డీఎంకేను వ్యతిరేకించే ఓటు బ్యాంకు ఎప్పుడూ అన్నాడీఎంకే వైపు ఉండేది. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకత్వ సమస్య…వరుస ఓటముల్ని విజయ్ క్యాష్ చేసుకుంటున్నారు. డీఎంకేను ఢీకొట్టే సత్తా కేవలం టీవీకేకే ఉంది అన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడంలో ఆయన సఫలమయ్యారు. దీనివల్ల గతంలో అన్నాడీఎంకేకు పడే ఓట్లు ఇప్పుడు గుంపగుత్తగా విజయ్ వైపు మళ్లుతున్నాయి. ప్రస్తుతం విజయ్ పార్టీలో సగం మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చేరిపోయారు. అలాగే క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం లేని లోటును అన్నాడీఎంకే నుంచి వస్తున్న అనుభవజ్ఞులైన నేతలతో విజయ్ భర్తీ చేస్తున్నారు. అన్నాడీఎంకే ఓటు బ్యాంకు శాశ్వతంగా తన వైపు మళ్లాలంటే, ఆ పార్టీ ఇక ఎప్పటికీ పుంజుకోకుండా చేయడమే మార్గమని విజయ్ భావిస్తున్నారు. అటు ప్రజల్లో… ఇటు రాజకీయాల్లో అమ్మ స్థానాన్ని భర్తీ చేయడానికి అడుగు వేస్తున్నారు.

సరికొత్త ద్రవిడ వారసత్వం

ద్రవిడ పార్టీలకు వ్యతిరేకం అని విజయ్ చెబుతారు కానీ ద్రవిడ సిద్ధాంతాలకు వ్యతిరేకమని చెప్పరు. ఆయనది కూడా ద్రవిడ సిద్ధాంతమే. పెరియార్ ఫోటోలను కూడా విజయ్ వాడుకుంటున్నారు. ఇటీవల ఎన్నికల్లో విజయ్ కు ఓ వేవ్ కనిపించింది. ఆ ఓటర్లు అంతా ద్రవిడ ఓటర్లే. అందుకే విజయ్ పార్టీ, మళ్లీ ఆ ఓటర్లు పాత పార్టీల వైపు వెళ్లకుండా జాగ్రత్త పడుతోంది. సోషల్ మీడియా హైప్ ద్వారా వచ్చినా అన్నాడీఎంకే స్థానాన్ని విజయ్ పూర్తిగా కైవసం చేసుకుని ..బలమైన నేతగా ఉంటారని టీవీకే నమ్ముతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360