Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లిక్కర్ లింకుల్లో దొరికిన షార్క్ 'సజ్జల'?

లిక్కర్ లింకుల్లో దొరికిన షార్క్ 'సజ్జల'?

Telugu 360 4 months ago

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా, ప్రభుత్వ , పార్టీ వ్యవహారాల్లో షాడో సీఎం గా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి.

గత ప్రభుత్వంలో జరిగిన అనేక భూ దందాలు, గనుల అక్రమాలు, ఇసుక దోపిడీల వెనుక ఆయన వ్యూహాలు ఉన్నాయనే ఆరోపణలు మొదటి నుంచీ వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమంది మాజీ మంత్రులు, కీలక నేతలు వరుసగా ఏసీబీ, సీఐడీ కేసుల్లో అడ్డంగా దొరికిపోతున్నప్పటికీ, సజ్జల మాత్రం తనపై ఎలాంటి ప్రత్యక్ష మచ్చ పడకుండా జాగ్రత్త పడటం రాజకీయ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

సాక్ష్యాలు దొరకనివ్వని 'తెలివి'.. జగన్‌కూ తప్పని ముప్పు?

సజ్జల రామకృష్ణారెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారనే పేరుంది. ఏ పెద్ద స్కీమ్ నడిచినా, ఏ వివాదాస్పద జీవో వచ్చినా, ఎక్కడా అధికారిక పత్రాలపై తన సంతకం గానీ, తన ప్రమేయం ఉన్నట్లు రికార్డులు గానీ లేకుండా చూసుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. విచిత్రమేమిటంటే, భవిష్యత్తులో దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే ఆయా నిర్ణయాలకు అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి లేదా సంబంధిత మంత్రులే బాధ్యులు అయ్యేలా సాక్ష్యాలను వదిలేస్తారు తప్ప, తన వైపు వేలు చూపించే అవకాశం ఇవ్వరని పార్టీ వర్గాల్లోనే టాక్ నడుస్తోంది. అందుకే ఇప్పటివరకు కేవలం సోషల్ మీడియా అక్రమ పోస్టుల కేసుల్లో మాత్రమే ఆయన విచారణను ఎదుర్కొన్నారు తప్ప, ప్రధాన ఆర్థిక కుంభకోణాల్లో ఆయనకు నోటీసులు పంపడం సాధ్యం కాలేదు.

లిక్కర్ స్కామ్‌లో దొరికిన 'సజ్జల' లింకులు!

అయితే, ఎంతటి తెలివిగల వ్యూహకర్త అయినా ఏదో ఒక చోట తప్పు కాలేయక తప్పదన్నట్లు.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం లో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రకు సంబంధించిన కీలక లింకులు దర్యాప్తు సంస్థల చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణ, డిస్టిలరీలకు అనుకూలంగా నిబంధనల సవరణ, క్యాష్ రూపంలో జరిగిన వందలాది కోట్ల రూపాయల లావాదేవీలపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ) చేతికి సజ్జల ప్రమేయాన్ని సూచించే కొన్ని డిజిటల్ ఆధారాలు, వాంగ్మూలాలు అందినట్లు సమాచారం. ఈ స్కామ్‌లో తెరవెనుక ఆర్థిక ప్రయోజనాలు పొందిన కొందరు దళారులు, అధికారులు సజ్జల రామకృష్ణారెడ్డి పేరును ప్రస్తావించడంతో సీన్ పూర్తిగా మారిపోయింది.

నోటీసులు జారీకి 'సిట్' సిద్ధం.. కదిలితే మొత్తం కదులుతుందా?

లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం ఊపందుకుంది. ఈ నోటీసుల జారీ ప్రక్రియ గనుక పూర్తయితే.. ఐదేళ్ల జగన్ పాలనలో జరిగిన అతిపెద్ద ఆర్థిక అక్రమాల మూలాలను తాకినట్లేనని ఐపీఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు సేఫ్ జోన్ లో ఉంటూ వచ్చిన సజ్జల గనుక ఈ కేసులో విచారణను ఎదుర్కొంటే, ఆయన ద్వారా గత ప్రభుత్వంలోని అనేక ఇతర స్కీముల రహస్యాలు, ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా నడిచిన లావాదేవీల చిట్టా మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360