Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లోకేష్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ నెక్ట్స్ లెవల్!

లోకేష్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ నెక్ట్స్ లెవల్!

Telugu 360 1 week ago

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే చిన్న అవకాశం వచ్చిన నారా లోకేష్ వదిలి పెట్టడం లేదు. సోషల్ మీడియా వేదికగా దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాల కదలికలను గమనిస్తూ, ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా ఏపీకి ఆహ్వానం పలుకుతున్న తీరు ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

క్లీన్ ఎనర్జీ రంగంలో అగ్రగామిగా ఉన్న అవాద గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టల్ సోషల్ మీడియా పోస్ట్‌పై లోకేష్ స్పందించిన వైనం ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తోంది.

భారతదేశ ఇంధన భవిష్యత్తు, గ్రీన్ హైడ్రోజన్, క్లీన్ ఎనర్జీ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంపై అవాద గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టల్ పంచుకున్న ఆలోచనలు మీడియాలో వచ్చాయి. పెట్టుబడుల ఆలోచనలు చేస్తున్నట్లుగా చెప్పారు. వాటిని అవాద గ్రూప్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. వెంటనే లోకేష్ ఆ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించారు. "భారతదేశ ఆత్మనిర్భర్ భారత్ విజన్‌కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమ సోలార్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తున్నాం. ఇప్పటికే ఈ రంగంలోని చాలా మంది దిగ్గజాలు ఏపీకి వచ్చారు. అని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి ని ట్యాగ్ చేస్తూ నేరుగా ఆహ్వానం పంపారు.

గతంలో కేవలం ప్రభుత్వ కార్యాలయాల ఫైళ్లకే పరిమితమైన పెట్టుబడుల చర్చలను, ఇప్పుడు లోకేష్ టెక్నాలజీ సాయంతో నేరుగా పారిశ్రామికవేత్తల ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన నిరంతరం వాడుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదం ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లో బాగా నానుతోంది. ఏపీలో నిర్ణయాలు ఎంత వేగంగా జరుగుతాయో చాటిచెప్పేందుకు, స్వయంగా మంత్రే ఇలాంటి ట్వీట్లకు రియాక్ట్ అవ్వడం కంపెనీలకు ప్రభుత్వంపై నమ్మకాన్ని కలిగిస్తోందని భావిస్తున్నారు.

రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లోకేష్, అందుకోసం గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, సెమీకండక్టర్స్ వంటి అధునాతన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల అనంతపురంలో రక్షణ రంగ పరిశ్రమల శంకుస్థాపన ఒక ఎత్తు అయితే, పునరుత్పాదక ఇంధన రంగంలో అవాద వంటి అగ్రశ్రేణి సంస్థలను రాష్ట్రానికి రప్పించడం ద్వారా రాయలసీమ మరియు కోస్తా తీర ప్రాంతాలను గ్రీన్ ఎనర్జీ హబ్‌లుగా మార్చాలన్నది ఆయన వ్యూహం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360