Dailyhunt
మెగా కోడలికి తొలి పరీక్ష

మెగా కోడలికి తొలి పరీక్ష

Telugu 360 1 week ago

అందాల రాక్షసితో ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. ఆ తరవాత తెలుగులో ఆమెకు మంచి ఆఫర్లే వచ్చాయి. శ్రీరస్తు- శుభమస్తు, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయినా లాంటి హిట్స్ తన ఖాతాలో ఉన్నాయి.

మధ్యలో కెరీర్ కొంత డల్ అయినా, ఆ తరవాత పుంజుకొంది. వరుణ్ తేజ్ తో ప్రేమలో పడడం, ఆ తరవాత ఇద్దరూ పెళ్లి చేసుకోవడం… లావణ్య కెరీర్‌లో జరిగిన అనూహ్యమైన పరిణామాలు. ఇప్పుడామె మెగా కోడలు. ఆ హోదాలో.. తాను తొలిసారి నటించిన 'సతీ లీలావతి' ఈవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. `భీమిలి కబడ్డీ జట్టు` లాంటి మంచి సినిమా అందించిన సత్య తాతినేని ఈ చిత్రానికి దర్శకుడు.

పెళ్లయ్యాక లావణ్య నుంచి వస్తున్న సినిమా కాబట్టి, దీనిపై ఎంతో కొంత ఫోకస్ ఉండడం ఖాయం. ప్రమోషన్లలోనూ తానే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగా హీరోల్లో ఒకర్ని తీసుకొచ్చి, కాస్తయినా హడావుడి చేయాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ట్రైలర్ రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేశారు. వరుణ్ తేజ్ గాలికి గాయమైంది. షూటింగులను పక్కన పెట్టి, ఆయన విశ్రాంతి తీసుకొంటున్నారు. సో.. వరుణ్ ఈ ఈవెంట్ కి హాజరయ్యే ఛాన్స్ లేదు. అల్లు అర్జున్‌, చిరంజీవి, సాయి ధరమ్ తేజ్‌… ఇలా ఎవర్నో ఒకర్ని తీసుకొచ్చి ఈవెంట్ చేయాలని చూస్తున్నారు. సాధారణంగా కథానాయికలు పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంటారు. కానీ లావణ్య మాత్రం సినిమాల్ని కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. 'సతీ లీలావతి' హిట్టయితే మాత్రం లేడీ ఓరియెంటెడ్ కథలు ఆమెను వెదుక్కొంటూ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే… మెగా కోడలిగా తొలి పరీక్షలో మాత్రం పాస్ అవ్వాలి. మరి ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360