Dailyhunt
మీడియావాచ్:  ఆర్కేకు వైసీపీ పబ్లిసిటీ

మీడియావాచ్: ఆర్కేకు వైసీపీ పబ్లిసిటీ

Telugu 360 3 weeks ago

వీకెండ్ కామెంట్ లో జగన్ రెడ్డిపై ఆర్కే కామెంట్లు చేయడం కామనే.. అయితే ఈ సారి మాత్రం ఆయనకు కోపం తెప్పించింది. అందుకే ధర్నాలు చేయాలని పార్టీ నేతలకు చెప్పారు.

ఎక్కడో ఎందుకు ఏబీఎన్ ఆఫీసు ముందు ధర్నా చేయాలని వైసీపీ నేతలు ప్లాన్ చేసుకుని హైదరాబాద్ వచ్చేశారు. ఏబీఎన్ ఆఫీసు ముందు ధర్నా చేశారు. ఏబీఎన్‌కు.. ఆర్కేకు ఇంతకంటే కావాల్సిందేముంది. ఏబీఎన్‌కూ వార్తలకు కొదవేముంటుంది?

వైసీపీ నేతలు ఏబీఎన్ కార్యాలయం ముందు ధర్నా చేయడంపై ఏబీఎన్ నిరంతరాయ ప్రసారాలు చేస్తోంది. ఉన్నమాట అంటే ఉలుకెందుకని ప్రశ్నిస్తోంది. వీకెండ్ కామెంట్ లో సహజంగా ఉన్న వాటిని మహిళల్ని కించ పరిచారన్నట్లుగా అన్వయించుకుని కృత్రిమ ధర్నాలు చేస్తున్నారని అసలు ఎవరు మహిళల్ని అవమానించారో వివరింగా టీవీలో ప్రసారం చేస్తున్నారు.

మీడియా ముందు ధర్నాలు అనేది రాజకీయ పార్టీల వ్యూహాత్మక తప్పిదాలు. ఆ లెక్కన సాక్షి ముందు ధర్నాలు కాదు.. సాక్షి ఆఫీసుల్ని రోజూ టీడీపీ నేతల కార్యకర్తలు బద్దలు కొట్టాలి. అంత ఘోరంగా వారి వార్తలు ఉంటాయి. ఆర్కే.. వీకెండ్ కామెంట్ న్యూస్ కాదు. ఆయన సొంత అభిప్రాయం. దానిపై వేరే అభిప్రాయం ఉంటే ఖండించవచ్చు కానీ ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ వచ్చి ధర్నాలు చేయడం తెలివైన నిర్ణయం కాదు. కానీ వైసీపీ నేతలు అదే చేస్తూంటారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360