Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోదీని కదా అడగాల్సింది - జగన్‌కు ధైర్యం లేదా?

మోదీని కదా అడగాల్సింది - జగన్‌కు ధైర్యం లేదా?

Telugu 360 4 months ago

ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిబంధనల వల్ల ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్ట్ ..

ఏ రాయి దొరికినా చంద్రబాబుపైనే విసరాలన్న పాలసీకి తగ్గట్లుగానే ఉంది. 2011 కంటే ముందు నుంచి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్ తప్పనిసరి చేయడాన్ని తప్పుపడుతూ జగన్ సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. అయితే, ఈ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తెచ్చినట్లుగా మొదట్లో కలరింగ్ ఇచ్చిన ఆయన.. చివరికొచ్చేసరికి చట్టాన్ని సవరించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలంటూ అసలు మ్యాటర్ ఒప్పుకుని దొరికిపోయారు.

జగన్ తన ట్వీట్‌లో.. 20-25 ఏళ్లుగా సబ్జెక్ట్ టీచర్లుగా కొనసాగుతున్న వారు ఇప్పుడు అన్ని సబ్జెక్టుల సిలబస్‌తో కూడిన టెట్ రాయమనడం, 60 శాతం మార్కులు సాధించాలనడం అన్యాయమని పేర్కొన్నారు. నాడు డీఎస్సీ లాంటి కఠినమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు పొందిన వారికి, అసలు టెట్ అనే పరీక్షే లేని కాలం నాటి ఉపాధ్యాయులకు ఈ నిబంధన వర్తింపజేయడం వల్ల ప్రమోషన్లు ఆగిపోయి మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వాపోయారు. అయితే, జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఈ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేస్తున్నాయి. అయిేత చంద్రబాబే ఈ రూల్స్ తెచ్చినట్లుగా జగన్ ట్వీట్ చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని, పూర్తిగా కేంద్ర చట్టాలకు లోబడి ఉన్న ఒక సున్నితమైన విద్యా వ్యవస్థా పరమైన అంశాన్ని పట్టుకుని.. చంద్రబాబును నిందించడం జగన్ పొలిటికల్ స్ట్రాటజీలో భాగమే. నిజంగానే జగన్ గారికి ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రతపై, వారి మానసిక ఒత్తిడిపై అంతటి అపారమైన ప్రేమ, పోరాట పటిమ ఉంటే.. చంద్రబాబుకు లేఖలు రాయాలని కోరడం ఎందుకు? నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే ఇదే లాంగ్వేజ్‌లో లేఖ రాయవచ్చు కదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్రంలో ఉన్న పెద్దలనే నేరుగా ప్రశ్నిస్తే.. చట్టంలో మార్పులు చేయాలో, లేదా రూల్స్ పక్కాగా అమలు చేయాలో తేల్చుకునే అవకాశం ఉంటుంది.

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో కూడా ఇదే టెట్ నిబంధనల వల్ల ఉపాధ్యాయులు కోర్టుల చుట్టూ, సెక్రటేరియట్ చుట్టూ తిరిగిన దాఖలాలు ఉన్నాయి. నాడు స్వయంగా ముఖ్యమంత్రి పీఠంపై ఉండి కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి చట్టాన్ని సవరించేలా అసెంబ్లీలో తీర్మానం చేయని జగన్.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే ఉపాధ్యాయులను చంద్రబాబుపైకి ఉసిగొల్పేలా ట్వీట్లు చేయడం విచిత్రమే. కేంద్రం పరిధిలోని చట్టాలను రాష్ట్ర ముఖ్యమంత్రికి ముడిపెడుతూ చేసే ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ ట్వీట్లు ప్రజల్లో చులకన చేస్తాయని ఆయనకు ఎవరూ చెప్పలేదేమో?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360