అఖిల్ పేరు మారింది. ఇప్పుడు ఆయన ఉత్తి అఖిల్ కాదు. 'నాగ' అఖిల్. 'లెనిన్' ప్రీ రిలీజ్ ఫంక్షన్లో.. అఖిల్ ని నాగ అఖిల్ గా పరిచయం చేశారు యాంకర్ సుమ.
నాగ్ + అఖిల్ అన్నమాట. అలా అఖిల్ కాస్త నాగ అఖిల్ అయ్యాడు.
'నాగ' అనే పదం.. అక్కినేని ఫ్యామిలీకి సెంటిమెంటల్ అటాచ్‌మెంట్. అక్కినేని నాగేశ్వరరావు లో 'నాగ' ఉంది. నాగార్జునలో 'నాగ' ఉంది. నాగ చైతన్యలోనూ ఉంది. నాగ సుశీల పేరులోనూ అదే సెంటిమెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు అఖిల్ పేరుకి సెంటిమెంట్ గా నాగ యాడ్ చేశారు.
అఖిల్ ప్రయాణం ముందు నుంచీ ఒడిదుడుకుల్లోనే సాగింది. తొలి సినిమా 'అఖిల్' డిజాస్టర్. 'హలో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', 'ఏజెంట్'.. ఇలా వరుసగా ఫ్లాపులు పడ్డాయి. 'లెనిన్' తో ఈసారి హిట్టు కొట్టాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసం ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం అంతా ట్రైలర్ లో కనిపించింది. ఈ సినిమా అఖిల్ కి డూ ఆర్ డై లాంటిదే. అందుకే ఏ చిన్న విషయాన్నీ వదలడం లేదు. అఖిల్ ముందు.. నాగ పేరు చేరడం వెనుక కారణం కూడా ఇదే. అలాగైనా అదృష్టం కలిసి వస్తుందేమో అని చిన్న ఆశ.
ఈనెల 10న 'లెనిన్' విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించారు. 9 రాత్రి నుంచి ప్రీమియర్లు మొదలయ్యే అవకాశం ఉంది.

