Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒక్క ట్వీట్ తో చిరు సమాధానం చెప్పేసినట్టేనా?

ఒక్క ట్వీట్ తో చిరు సమాధానం చెప్పేసినట్టేనా?

Telugu 360 1 week ago

మెగాస్టార్ చిరంజీవి 'ఇరుముడి' చిత్రబృందాన్ని అభినందిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు మరో కారణంతోనూ ఆసక్తికరంగా మారింది.

సాధారణంగా ఓ సినిమా విజయం సాధిస్తే..

చిత్రబృందాన్ని అభినందించడం చిరంజీవికి కొత్తేమీ కాదు. కానీ ఈసారి ఆయన ట్వీట్ చివర్లో రాసిన కొన్ని మాటలు మాత్రం ప్రత్యేకంగా అండర్‌లైన్ చేసుకోవాల్సినవే.

"ఒక సినిమా విజయం పరిశ్రమలో అందరికీ పండగే. ఈ పరిశ్రమ అందరిదీ.. ఏ కొందరిదో కాదు. మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి."

ఈ మాటలు కేవలం 'ఇరుముడి' విజయాన్ని ప్రశంసిస్తూ రాసిన సాధారణ వ్యాఖ్యలుగా చూడలేం. సినిమా పరిశ్రమపై చిరంజీవి ఆలోచనా విధానం ఏమిటో చెప్పే స్టేట్‌మెంట్‌లా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ మధ్య సోషల్ మీడియాలో మెగాస్టార్‌పై ఒక వర్గం చేస్తున్న విమర్శలు, ఆరోపణలు గమనిస్తే.. ఈ మాటలకు మరింత ప్రాధాన్యత కనిపిస్తుంది. ప్రతిభ ఉన్నవాళ్లను ఎదగనివ్వడం లేదని, ఇండస్ట్రీలో తన ప్రభావాన్ని ఉపయోగించి ఇతరులను తొక్కేస్తున్నారంటూ కొందరు నేరుగా ఆరోపణలు చేస్తున్నారు.

అలాంటి మాటలన్నింటికీ చిరంజీవి ప్రత్యేకంగా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనే చెప్పాలి. కానీ ఆయన తన ట్వీట్‌లో చెప్పిన "పరిశ్రమ అందరిదీ.. ఏ కొందరిదో కాదు" అనే ఒక్క వాక్యం మాత్రం ఆయన వైఖరిని చాలా స్పష్టంగా చెబుతోంది.

అంతేకాదు.. "మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి" అనే మాటలో కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ ఫిలాసఫీ ఉంది. ఒక సినిమా హిట్ అయితే అది కేవలం హీరోకో, దర్శకుడికో, నిర్మాతకో వచ్చిన విజయం కాదు. ఆ విజయంతో నిర్మాత నుంచి డిస్ట్రిబ్యూటర్ వరకు, థియేటర్ యజమాని నుంచి టెక్నీషియన్ వరకు.. మొత్తం వ్యవస్థకు లాభం చేకూరుతుందన్న ఆలోచన ఇందులో కనిపిస్తుంది.

సినిమా పరిశ్రమలో ఒకరి విజయం మరొకరికి నష్టం కావాల్సిన అవసరం లేదని.. ఒక సినిమా ఎదగడం అంటే మరో సినిమా కిందకు వెళ్లడం కాదని చెప్పే సందేశం కూడా ఇందులో ఉంది.

అందుకే ఈ ట్వీట్‌ను కేవలం 'ఇరుముడి' టీమ్‌కు చిరంజీవి ఇచ్చిన కంగ్రాట్స్‌గానే చూడటం కంటే.. తనపై వస్తున్న విమర్శలకు ఆయన తనదైన శైలిలో ఇచ్చిన సమాధానంగా కూడా చూడొచ్చు.

చిరంజీవి గురించి సోషల్ మీడియాలో ఎలాంటి రాతలు వచ్చినా.. ఆయన మాత్రం తన మాటల్లోనే తన పంథాను మరోసారి చెప్పినట్టుంది.

"మనం బతకాలి.. ఇతరులనూ బతికించాలి."

ఇండస్ట్రీలో ఎవరు ఎదిగినా అది తనకు కూడా పండగే అన్న మెగాస్టార్ మాటల్లో.. ఒక సీనియర్ హీరోగా, దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్న వ్యక్తిగా ఆయన అనుభవం కూడా కనిపిస్తోంది.

విమర్శలకు కౌంటర్ ఇవ్వడానికి పెద్ద పెద్ద మాటలు అవసరం లేదన్నట్టుగా.. ఒక్క ట్వీట్‌తో తన ఆలోచన ఏంటో చెప్పేశారు చిరంజీవి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360