Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాస్‌పోర్టు సరెండర్ చేసిన విడదల రజని!

పాస్‌పోర్టు సరెండర్ చేసిన విడదల రజని!

Telugu 360 1 week ago

వైసీపీ మహిళా నేత విడదల రజని ఆదివారం పల్నాడు జిల్లా నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో తన పాస్‌పోర్ట్‌ను అధికారులకు అప్పగించారు. హైకోర్టు జారీ చేసిన స్పష్టమైన ఉత్తర్వుల మేరకే ఆమె డీఎస్పీ హనుమంతరావును కలిసి అధికారికంగా పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాల్సి వచ్చింది.

గతంలో చిలకలూరిపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత పిల్లి కోటిని అధికారంలో ఉన్నప్పుడు పోలీసులతో హింసించారు. పోలీసులు కోటిని కొట్టడాన్ని ఆమె స్వయంగా వీడియోకాల్‌లో చూశారని కోటి ఫిర్యాదుచేశారు. ఈ ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్‌లో విడదల రజనితో పాటు ఆమె అనుచరులు మరికొందరిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడంతో అరెస్టు చేయకుండా కోర్టుకు వెళ్లారు.

ఈ కేసు విచారణ వేగవంతం కావడంతో, అరెస్ట్ భయంతో ఆమె చట్టపరమైన రక్షణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ లేదా కఠిన చర్యల నుండి మినహాయింపు కోరుతూ విడదల రజని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు షరతులతో కూడిన ఆదేశాలను జారీ చేసింది. నిందితురాలు కేసు దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉండాలని, విచారణ నుంచి తప్పించుకోవడానికి విదేశాలకు పారిపోయే అవకాశం లేకుండా ఉండేందుకు తక్షణమే తన పాస్‌పోర్ట్‌ను స్థానిక పోలీసు అధికారుల వద్ద డిపాజిట్ చేయాలని న్యాయస్థానం గట్టి నిబంధన విధించింది.

కోర్టు విధించిన ఈ నిబంధనల ప్రకారమే ఆదివారం ఇద్దరు న్యాయవాదులతో కలిసి నరసరావుపేట డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న విడదల రజని, అక్కడ పోలీస్ స్టేషన్ రిజిస్టర్‌లో సంతకం చేసి తన పాస్‌పోర్ట్‌ను అప్పగించారు. చట్టపరమైన నిబంధనలకు లోబడి, కేసు దర్యాప్తుకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360