పాడేరు అడవుల్లో పోలీసులకు పెద్ద సినిమా చూపించిన పాస్టర్ అభినయ్ దర్శన్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఆయన ట్రాక్ రికార్డును పోలీసులు వెలికి తీస్తున్నారు.
ఆయన నటకౌశలం మొదట వెండితరెపైనే చూపించారు. సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే లక్ష్యంతో మొదట సినిమాల్లో అడుగుపెట్టిన ఆయన.. గతంలో హీరోగా మాయాజాలం' అనే సినిమాలో పట్టించారు. కొన్ని ఇతర సినిమాల్లో నటించారు. అవి రిలీఫ్ అయ్యాయో లేదో ఎవరికీతెలియదు. ట
అయితే, టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో సక్సెస్ లభించకపోవడం, హీరోగా కెరీర్ ముందుకు సాగకపోవడంతో ఆయన అత్యంత వేగంగా తన రూట్ మార్చేశారు. వెండితెరకు గుడ్ బై చెప్పి పాస్టర్ గా మారాడ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో చర్చిలను ఏర్పాటు చేసి.. తన వాగ్ధాటితో, ప్రత్యేక ప్రార్థనలతో స్వల్ప కాలంలోనే ఒక వర్గం ప్రజలను ఆకర్షించారు. అయితే, ఆయన పాస్టర్‌గా మారిన తర్వాతే అసలైన వివాదాలు మొదలయ్యాయి. అభినయ్ దర్శన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మూడు పెళ్లిళ్ల వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపింది.
ఆయన భార్యలు ఆయనపై గృహహింస, మోసం కేసులతో పోలీసులు కేసులుపెట్టారు. భరణం వివాదాలు కోర్టుల దాకా వెళ్లడంతో ఆధ్యాత్మిక వేదికలపై ఆయన చెప్పే మాటలకు, నిజజీవితానికి పొంతన లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వ్యక్తిగత, మతపరమైన వివాదాలు ఒకవైపు నడుస్తుండగానే.. అభినయ్ దర్శన్ ఇప్పుడు భరోసా అనే పార్టీతో రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. సమాజంలో ఇబ్బందులు పడుతున్న వారికి, బాధితులకు తానే పెద్ద దిక్కునంటూ భరోసా పేరుతో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సరైన ప్రచారం రావడం లేదనుకుని తనపై దాడి చేయించుకుని ఫ్లాట్ సినిమాను మళ్లీ తీశారు.
ఈ అభినయ్ దర్శన్ చేసిన నిర్వాకంతో పాస్టర్లకు చెడ్డపేరు తెచ్చేలా ఉందని నిజమైన క్రిస్టియన్లు మండిపడుతున్నారు. సమాజంలో చిచ్చు పెట్టేందుకు కొన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఆయన డ్రామాలాడుతున్నారని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు.

