Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పండగ ముందే పెద్ద క్లాష్!

పండగ ముందే పెద్ద క్లాష్!

Telugu 360 2 weeks ago

2027 సంక్రాంతికి భారీ పోటీ ఉంది. చిరంజీవి, వెంకటేష్, రవితేజ, సాయి ధరమ్ తేజ్, శర్వానంద్.. అందరి గురి పండగపైనే ఉంది. ఇప్పటికే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి రెడీగా ఉన్నారు.

అయితే సంక్రాంతికి ముందే వచ్చే క్రిస్మస్‌కు కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్ద క్లాష్ తప్పేలా లేదు.

క్రిస్మస్ బరిలో బాలకృష్ణ, నాగార్జున సినిమాలు తలపడుతున్నాయి. బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమా రిలీజ్‌ను డిసెంబర్ 24న ప్లాన్ చేస్తున్నారు. అదే డేట్‌కు ఇప్పుడు నాగార్జున 'కింగ్ 100' కూడా రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది.

ఇక అదే డేట్‌కు షారుక్ ఖాన్ మూవీ #KING కూడా థియేటర్లలోకి రానుంది. షారుక్, అభిషేక్, దీపిక ఇలా భారీ తారాగణం ఉన్న సినిమా ఇది. బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్ 'వీరసింహారెడ్డి'తో హిట్ కొట్టింది. నాగార్జున కెరీర్‌లో 'కింగ్ 100' మైలురాయి సినిమా. మూడూ కూడా భారీ అంచనాలు ఉన్న సినిమాలే. దీంతో బాక్సాఫీస్ దగ్గర పండగకు ముందే భారీ క్లాష్ కనిపించబోతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu 360